లోకేశ్‌కు అపూర్వ స్వాగతం
ABN , First Publish Date - 2023-12-03T01:22:03+05:30 IST
పిఠాపురంలో లోకేశ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. నియోజకవర్గమంతా ఆయన వెంట నడిచేందుకు వచ్చిందా అన్నట్లు చిత్రాడ వద్ద రహదారులన్నీ జనసంద్రమయ్యాయి.
పాదయాత్ర వెంట నడిచిన అశేష జనవాహిని
పిఠాపురం, డిసెంబరు 2: పిఠాపురంలో లోకేశ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. నియోజకవర్గమంతా ఆయన వెంట నడిచేందుకు వచ్చిందా అన్నట్లు చిత్రాడ వద్ద రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నా రా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 215వరోజు శనివా రం చిత్రాడవద్ద పిఠాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ ఆధ్వర్యంలో అశేషంగా తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభి మానులు, ప్రజలు, మహిళలు, యువత అపూర్వ రీతిలో లోకేశ్‌కు స్వాగతం పలికారు. వర్మతోపాటు ఆయన సతీమణి లక్ష్మీదేవి, కుమారుడు గిరీష్‌వర్మలు లోకేశ్‌కు ఆత్మీయస్వాగతం తెలిపారు. వర్మ సతీమణి లక్ష్మీదేవి హారతి ఇచ్చారు. తీన్‌మార్ డ్యాన్స్‌లు, మ్యూజిక్ బ్యాండ్‌లు, డప్పు వాయిద్యాలతో నడుమ లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైంది. మీసేవా కేంద్రంవద్ద న్యాయవాదులు వినతిపత్రం ఇచ్చారు. చిత్రాడ గ్రామం నుంచి ఆర్వోబీ మీదుగా పిఠాపురం బైపాస్‌రోడ్డుకు చేరుకున్నారు. పాదగయ క్యాంప్‌సైట్‌నుంచి సాయంత్రం 4గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం. బైపాస్‌రోడ్డు, విరవాడ రోడ్డు, పోలీస్‌స్టేషన్ సెంటర్, ప్రభుత్వాస్పత్రి, అంబేడ్కర్ సెంటర్, పాతబస్టాండు, ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ కళాశాల, ఉప్పాడ సెంటర్, రైల్వేగేటు, డ్రైవర్స్‌కాలనీ మీదుగా పాదయాత్ర సాగింది. ఉప్పాడ రైల్వేగేటు వద్ద అంబులెన్స్ రావడంతో దానికి దారి ఇచ్చారు. అనంతరం పాదయాత్ర నవఖండ్రవాడ, కొండెవరం గ్రామాల మీదుగా యండపల్లి రాత్రి విడిది సైట్‌కు చేరుకుంది. లోకేశ్ పాదయాత్రలో జనసైనికులు సందడి చేశారు. జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు విరవాడ రోడ్డువద్ద లోకేశ్‌కు స్వాగతం పలికారు. అక్కడినుంచి పాదయాత్రలో పాల్గొన్నారు.
కాకినాడ రూరల్లో ముగిసిన లోకేశ్ పాదయాత్ర
సర్పవరం జంక్షన్: కాకినాడరూరల్ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం తిమ్మాపురం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. రెండురోజులపాటు కాకినాడరూరల్ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో టీడీపీ జిల్లా అధ్యక్షు డు జ్యోతుల నవీన్, సానా సతీష్, గుణ్ణం చంద్రమౌళి, మాజీ ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, వనమాడి కొండబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, జిల్లా ఉపాధ్యక్షుడు పేరాబత్తుల రాజశేఖర్, మాజీ జడ్పీటీసీ నలుకుర్తి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ వాసిరెడ్డి ఏసుదాసు, డాక్టర్ చప్పిడి వెం కటేశ్వరరావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ వెంకట్రాజు పాల్గొన్నారు.
యండపల్లి జంక్షన్‌లో భారీ స్వాగతం
కొత్తపల్లి: యువగళం పాదయాత్ర కొత్తపల్లి మండలం యండపల్లి జంక్షన్ చేరుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు శనివారం రాత్రి ఇక్కడ టీడీపీ, జనసేన శ్రేణులు స్వాగతం పలికారు. కొండెవరంలో దళిత నాయకుడు వేమగిరి రాంబాబు, యండపల్లి జంక్షన్‌లో పిఠాపురం నియోజకవర్గ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు రావు అక్షయ్ ఆధ్వర్యంలో లోకేశ్‌ను భారీగజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కొండెవరం ఎంపీటీసీ దుళ్ల సత్తిబాబు, మాజీ ఎంపీ టీసీలు గాది రాజబాబు, కూరాకుల సుధాకర్, టీడీపీ నాయకులు దాకే థామస్‌పీటర్, రెడ్నం దొరబాబు, గుండా అప్పారావు, జనసేన నాయకులు మత్సా అప్పాజీ పాల్గొన్నారు.
‘స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు’
పిఠాపురం: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని నారా లోకేశ్ మండిపడ్డారు. కనీసం బ్లీచింగ్ చల్లేందుకు కూడా నిధులు లేకుండా చేశారని తెలిపారు. పిఠాపురం పట్టణంలోని లారీ యూనియన్ కార్యాలయం వద్ద జగ్గయ్యచెరువు కాలనీ, రథాలపేట వాసులు యువనేత లోకేశ్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. జగ్గయ్యచెరువు కాలనీలో పదివేల మంది నివసిస్తున్నామని, పాత, కొత్త కాలనీల్లో డ్రైనేజీలు లేవని, మురుగునీరు నిలిచిపోయి దోమలబెడద, అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నామని వారు వివరించారు.
తునిలో భారీ ఏర్పాట్లు
తునిరూరల్ : యువగళం పాదయాత్రలో జిల్లాలో అడుగుపెట్టిన యువనేత నారా లోకేష్ యాత్రను విజయవంతం చేసేందుకు తునిలో టీడీపీ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తుని నియోజకవర్గం యువగళం పాదయాత్ర ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్థానిక నేతలతో సమావేశమయ్యారు. తుని నియోజకవర్గంలో మూడు రోజుల పాటు కొనసాగనున్న పాదయాత్ర మార్గం, బహిరంగ సభ ప్రదేశాలను స్థానిక టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర టీడీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు సుర్ల లోవరాజు, చింతమనీడి నాగ సోమరాజుతో పాటుగా పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.
లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయాలి: బండారు
ప్రత్తిపాడు : తుని నియోజకవర్గంలో ఆది, సోమవారాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించే యువగళం పాదయాత్రను విజయంతం చేయాలని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంవద్ద నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వరుపుల సత్యప్రభరాజా అధ్యక్షతన శనివారం సాయంత్రం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి బండారు ముఖ్య అతిఽథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరఽథం పడుతున్నారన్నారు. సత్యప్రభ మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ నలుమూలల నుంచి తుని నియోజకవర్గంలో లోకేష్ నిర్వహించే పాదయాత్రకు పార్టీ శ్రేణులు పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, కాకినాడ పార్లమెంటరీ టీడీపీ ఉపాధ్యక్షులు కొమ్ముల కన్నబాబు,ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం మండలపార్టీల అధ్యక్షుడు అమరాది వెంకట్రావు, సూది బూరయ్య, బద్ది రామారావు, టీడీపీ నాయకులు పర్వత సురేష్, వెన్నాశివ, పల్లా గోపి, బస్వా ప్రసాద్, బొదిరెడ్డి గోపాలకృష్ణ పాల్గొన్నారు.
సైకో జగన్ పాలనను సాగనంపండి : రామకృష్ణారెడ్డి
పెదపూడి: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకో జగన్ పాలనను సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి నియోజకవర్గ మహిళా నాయకులు జుత్తుక సూర్యకుమారి ఆధ్వర్యంలో పెద్దాడలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా జరిగిన మహాశక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికీ వెళ్లి చంద్రబాబును ఏవిధంగా అక్రమంగా అరెస్టుచేసింది ప్రజలకు తెలుపుతూ టీడీపీ మేని ఫెస్టోవల్ల కలుగు లాభాలను వివరించారు. ఈకార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకులు బండి సత్యవతి, సుభాషిణి, లక్ష్మి, టీడీపీ నాయకులు పుట్టా గంగాధరచౌదరి, జుత్తుక కృష్ణ, కొటికలపూడి సత్తిబాబు, పైణ్ణి బాబు, వల్లూరి సత్తిబా బు, బొడ్డు శ్రీనివాస్, ప్రత్తిపాటి భద్రరరావు, గంటా రాజు, చిర్రా వరప్రసాదరావు, మందపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి విజయం తధ్యం
జగ్గంపేట: జగ్గంపేట గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మహాశక్తి చైతన్య రథయాత్ర ముగిం పు కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి ఇంటింటికీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టో పథకాలు వివరించారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, దాపర్తి సీతారామయ్య, పీలామహేష్, గుండా శివప్రసాద్, డేగల సత్తిబాబు, నేదురిగణేష్, రాయి సాయి పాల్గొన్నారు.