ఎల్‌ఐసీని దివాళా తీయించేందుకు కుట్ర
ABN , First Publish Date - 2023-03-05T01:15:38+05:30 IST
ఎల్‌ఐసీని దివాలా తీయించేందుకు కేంద్రం కుట్ర చేసిందని ఆలిండియా ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం పూర్వపు ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్ అన్నారు.
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 4: ఎల్‌ఐసీని దివాలా తీయించేందుకు కేంద్రం కుట్ర చేసిందని ఆలిండియా ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం పూర్వపు ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్ అన్నారు. రాజమహేంద్రవరం జెఎన్ రోడ్డు సూర్యగార్డెన్స్‌లో శనివారం జరిగిన ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్ 26వ మహాసభలో ఆయన మాట్లాడారు. అదానీ ఇండెన్‌బర్గ్ రిపోర్టు నేపథ్యంలో దేశమంతా ఎల్‌ఐసీలో పెట్టిన షేర్లు పతనం అయ్యాయనే ఆందోళన ప్రజల్లో నెలకొందన్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని యూనియన్ పరంగా స్పష్టం చేస్తున్నామని చెప్పారు.ఎల్‌ఐసీకి ఏమాత్రం నష్టం జరగలేదన్నారు. యూనియన్ రాజమహేంద్రవరం డివిజన్ అధ్యక్షుడు ఎంఎఎఫ్ బెనర్జీ పదవీవిరమణ సందర్భంగా సత్కరించారు. ఈ సభలో యూనియన్ నాయకులు డాక్టర్ గుబ్బల రాంబాబు, బీఎస్.రవి, జోనల్ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, సౌత్ జోన్ ఉపాధ్యక్షుడు కిషోర్ కుమార్, తెలంగాణ మహిళా కన్వీనర్ మైఽథిలి పాల్గొన్నారు.