‘అంబేడ్కర్‌ జయంతిన మద్యం అమ్మకాలు ఆపాలి’

ABN , First Publish Date - 2023-04-03T00:17:05+05:30 IST

డా.బీఆర్‌.అంబేడ్కర్‌ జయంతి రోజున మద్యం అమ్మకాలు నిలిపివేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. కచేరీపేట యూటీఎఫ్‌ హోంలో ఆదివారం జన విజ్ఞానవేదిక, మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ సమావేశం సీనియర్‌ నేత అయితాబత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన జరిగిం ది. మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ కన్వీనర్‌ డా.సూర్యనారాయణ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి రోజున

‘అంబేడ్కర్‌ జయంతిన మద్యం అమ్మకాలు ఆపాలి’

పోర్టుసిటీ (కాకినాడ) ఏప్రిల్‌ 2: డా.బీఆర్‌.అంబేడ్కర్‌ జయంతి రోజున మద్యం అమ్మకాలు నిలిపివేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. కచేరీపేట యూటీఎఫ్‌ హోంలో ఆదివారం జన విజ్ఞానవేదిక, మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ సమావేశం సీనియర్‌ నేత అయితాబత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన జరిగిం ది. మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ కన్వీనర్‌ డా.సూర్యనారాయణ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి రోజున మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్న విధంగానే అంబేడ్కర్‌ జయంతి రోజున నిలిపివేయాలని కోరారు. జన విజ్ఞానవేదిక జిల్లా అధ్యక్షుడు కెఎంఎంఆర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కోరడంతో పాటు ప్రజలను ముఖ్య ంగా యువతను మద్యానికి దూరంగా ఉంచే విధంగా వివిధ రూపాల్లో ప్రచారం చేద్దామన్నారు. కలెక్టర్‌కు, ఎక్సైజ్‌శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వాలని తీర్మానించారు. సమావేశంలో సీఐటీయూ భారత ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, ఆర్‌పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్‌, యునైటెడ్‌ ఎస్సీ, ఎస్టీ ఫోరం నాయకులు మోతా కృష్ణమూర్తి, బయ్యా విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:17:05+05:30 IST