భూహక్కు చట్టం రద్దు చేయాలని నిరసన
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:57 PM
ఏపీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన ఏపీ భూహక్కుల చట్టం వల్ల ఆక్రమణలు ఎక్కువై అమాయకులు బలైపోతారని న్యాయవాదులు మండిపడ్డారు.
రాజమహేంద్రవరం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన ఏపీ భూహక్కుల చట్టం వల్ల ఆక్రమణలు ఎక్కువై అమాయకులు బలైపోతారని న్యాయవాదులు మండిపడ్డారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా న్యాయవా దులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించారు. రాజమహేంద్ర వరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీచౌక్,ఆజాద్‌చౌక్, కోటిపల్లి బస్టాండ్, మెయిన్‌రోడ్డు, కోట గుమ్మం గుండా ర్యాలీ సాగింది. ప్రజా వ్యతిరేక భూహక్కుల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ న్యాయవా దులు నినాదాలు చేశారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ఏపీ భూహక్కుల చట్టాన్ని రద్దు చేసే వరకూ ఉద్యమిస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ నెల 22 వరకూ విధులకు హాజరు కాకూడదని రాజమండ్రి బార్ అసోసియేషన్ తీర్మానించిందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి కవి హనుమంతరావు, కోశా ధికారి ఎంవీ దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు గేదెల వెంకటేశ్వరరావు, సం యుక్త కార్యదర్శులు మేక శ్రీనివాసరావు, రామారావు చౌదరి పాల్గొన్నారు.