భూ సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-02-21T00:43:00+05:30 IST

మండలంలోని నందరాడ, నరేంద్రపురం గ్రామాల్లో దీర్ఘకాలంగా ఉన్న భూసమస్యలను పరిష్కరించాలంటూ అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) ఆధ్వర్యంలో సోమవారం రాజా నగరంలో ధర్నా, ప్రదర్శన చేపట్టారు.

భూ సమస్యలు పరిష్కరించాలి

రాజానగరం, ఫిబ్రవరి 20: మండలంలోని నందరాడ, నరేంద్రపురం గ్రామాల్లో దీర్ఘకాలంగా ఉన్న భూసమస్యలను పరిష్కరించాలంటూ అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) ఆధ్వర్యంలో సోమవారం రాజా నగరంలో ధర్నా, ప్రదర్శన చేపట్టారు. స్థానిక అన్నదాన సత్రం నుంచి ప్రదర్శనగా తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జనిపల్లి సత్తిబాబు, పి.వెంకట్‌నాయుడు మాట్లాడుతూ నందరాడలో 435/6; 7,429/2బి సర్వే నంబర్లలో 8.24 ఎక రాల భూమిని 40 పేద కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయని, ఇటీవల కాలంలో విక్రయాలు జరిగాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 18 ఏళ్లుగా సాగు చేస్తున్న సీలింగ్‌ భూములకు అడం గళ్లల్లో సాగుదారు పేర్లు నమోదు చేయాలని, క్రయ విక్రయాలను రద్దు చేయాలని నినదించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ నాయ కులు జి.సూరిబాబు, ఎం.వెంకన్న, మరుకుర్తి వీరలక్ష్మి, బొలిశెట్టి సత్యవతి, నక్కా లక్ష్మి, చిరుకూరు నాగమ్మ, షేక్‌ బేబీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T00:43:02+05:30 IST