కొవ్వూరు ఇన్‌చార్జి ఆర్‌డీవోగా కృష్ణనాయక్
ABN , First Publish Date - 2023-11-24T00:21:23+05:30 IST
కొవ్వూరు ఇన్‌చార్జి ఆర్డీవోగా రాజమహేంద్రవరం కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డివ్యూటీ కలెక్టర్ రమావత్ కృష్ణనాయక్ బాధ్యతలు స్వీకరించారు.
కొవ్వూరు, నవంబరు 23 : కొవ్వూరు ఇన్‌చార్జి ఆర్డీవోగా రాజమహేంద్రవరం కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డివ్యూటీ కలెక్టర్ రమావత్ కృష్ణనాయక్ బాధ్యతలు స్వీకరించారు.కృష్ణనాయక్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ట్రైనింగ్ పూర్తిచేసుకుని రాజమహేంద్రవరంలో కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా మొట్టమొదటి పోస్టింగ్‌లో జా యినై కొవ్వూరు ఇన్‌చార్జి ఆర్డీవోగా అదనపు బాధ్యతలు తీసుకోవడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు, ఓటర్ల జా బితా పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కొవ్వూరు ఆర్డీ వోగా పనిచేసిన ఎస్.మల్లిబాబు రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ అధికారిగా విజయవాడకు బదిలిపై వెళ్లారన్నారు.