2 నుంచి నరసన్న కల్యాణోత్సవాలు

ABN , First Publish Date - 2023-02-13T00:37:47+05:30 IST

చారిత్రాత్మక కోరుకొండ శ్రీ లక్ష్మినరసింహస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ మహోత్సవం మార్చి 2 నుంచి 8వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.

2 నుంచి నరసన్న కల్యాణోత్సవాలు
కోరుకొండ శ్రీ లక్ష్మినరసింహస్వామి

కోరుకొండ, ఫిబ్రవరి12: చారిత్రాత్మక కోరుకొండ శ్రీ లక్ష్మినరసింహస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ మహోత్సవం మార్చి 2 నుంచి 8వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్న వరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2న సాయంత్రం 5 గంటలకు అంకురార్పణం, 3న మధ్యాహ్నం 2 గంటలకు రథోత్సవం, అదే రోజు రాత్రి 9 గంటలకు కల్యాణ మహోత్సవం, 7న ఉదయం 9 గంటలకు చక్రతీర్థం, సాయంత్రం 7 గంటలకు అద్దాల సేవ, 8న రాత్రి 7 గంటలకు శ్రీ పుష్పయాగం ఉంటాయని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 2 నుంచి 8 వరకు భక్తులు స్వామికి సమర్పించే కొబ్బరి ము క్కులు, తలనీలాలు, పోగు చేసుకొనుటకు కోరుకొండ తీర్ధంలో జోళ్ళు భద్రపరుచుకోవడానికి జోళ్ళస్టాండ్‌ లైసెన్స్‌ హక్కులకు ఈ నెల 15న మధ్యాహ్నం 2గంటలకు బహిరంగ వేలంపాటలు నిర్వహించను న్నట్టు తెలిపారు. కల్యాణ మహోత్సవాలకు సంబఽం ధించి ఏర్పాట్లు విషయమై ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు లక్ష్మినరసింహస్వామి కల్యాణ మండపంలో సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని అన్నవరం దేవస్థానం జాయింట్‌ కమిషనర్‌ ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమ హేంద్రవరం సబ్‌ కలెక్టర్‌, స్థానిక అధికారులు, అనధికారులు పాల్గొంటారని తెలిపారు.

Updated Date - 2023-02-13T00:37:49+05:30 IST