కోరుకొండ భూ సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2023-06-03T01:18:30+05:30 IST

దశాబ్ధకాలంగా మండలంలోని ఐదు గ్రామాల ప్రజానీకం నిషేధిత జాబితాలో ఉండడంతో సమస్యకు పరిష్కార దిశగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శుక్రవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి కార్యాల యంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యాయరు.

కోరుకొండ భూ సమస్యల పరిష్కారానికి కృషి
కోరుకొండ భూ సమస్యలపై సీఎం కార్యాలయంలో కీలక సమావేశం

  • తాడేపల్లిలో ముఖ్యఅధికారులతో కీలక సమావేశం

కోరుకొండ, జూన్‌ 2: దశాబ్ధకాలంగా మండలంలోని ఐదు గ్రామాల ప్రజానీకం నిషేధిత జాబితాలో ఉండడంతో సమస్యకు పరిష్కార దిశగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శుక్రవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి కార్యాల యంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యాయరు. కోరుకొండ, జంబుప ట్నం, పశ్చిమగోనగూడెం, శ్రీరంగపట్నం, కాపవరం గ్రామాలకు చెందిన భూములు 22ఏ1బి ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఎమ్మెల్యే రాజా ఈ సమస్యను సీఎం జగన్‌ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లగా సమస్య తీవ్ర తను గుర్తించిన సీఎం తన కార్యదర్శి ధనంజయరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య మంత్రి కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, బాధిత గ్రామాల నాయకులతో సమావేశం నిర్వహిం చారు. సమావేశంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సీసీఎల్‌ఏ సాయి ప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత, ఆర్డీవో చైతన్యవర్షిణి ఈ సమావేశంలో పాల్గొని సమస్యపై విస్తృతంగా చర్చించారు. త్వరలోనే కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్‌ సమస్యకు పరిష్కారం చూపుతామని ఉన్నతాధికారులు తెలిపి నట్టు ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో కోరుకొండ నుంచి డాక్టర్‌ కుంచే వెంకటరమణ, వైస్‌ ఎంపీపీ బొరుసు బద్రినారాయణ, వాకా నరసింహారావు, సూరిశెట్టి శ్రీనివాసు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:18:30+05:30 IST