కరవాక వైసీపీలో ముసలం
ABN , First Publish Date - 2023-11-20T00:17:50+05:30 IST
కరవాక వైసీపీలో ముసలం

మామిడికుదురు, నవంబరు 19: మామిడికుదురు మండ లం కరవాక గ్రామంలో వైసీపీలో ముసలం మొద లైంది. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన రాపాక వరప్ర సాదరావు తీరుపై ఆ పార్టీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాము పార్టీని అంటి పెట్టు కున్నప్పటికీ తమను పట్టించుకోకుండా ఒక వర్గానికి ప్రాధా న్యత ఇచ్చి ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరో పించారు. సీనియర్లు అయినప్పటికీ తమకు ప్రాధాన్యత లేకుండా పార్టీని గ్రామంలో భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శిం చారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాముఖ్యత ఇచ్చి తమను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ఆయనకు వ్యతిరేకంగా టెంట్‌వేసి నినాదాలు చేశారు. భవిష్యత్తు కార్యా చరణ త్వరలో ప్రకటిస్తామని అల్టిమేటం ఇచ్చారు. కార్యక్ర మంలో సర్పంచ్ రేకాడి సత్యనారాయణ, ఎంపీటీసీ మల్లాడి వడ్డికాసులు, మాజీ సర్పంచ్ చిర్రా శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.