‘గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి’
ABN , First Publish Date - 2023-03-09T00:33:45+05:30 IST
స్థానిక మహాత్మా జ్యోతీబాపూలే వెనకబడిన తరగతుల సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో 5వ తరగతి (ఇంగ్లీషు) వ్రేశానికి అర్హులైనవారు ఏప్రిల్ నెల 4లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ కేవీ రామకృష్ణారావు పేర్కొన్నారు. బీసీ అభ్యర్థులు 2012 సెప్టెంబర్ 1వ తేదీ
కరప, మార్చి 8: స్థానిక మహాత్మా జ్యోతీబాపూలే వెనకబడిన తరగతుల సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో 5వ తరగతి (ఇంగ్లీషు) వ్రేశానికి అర్హులైనవారు ఏప్రిల్ నెల 4లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ కేవీ రామకృష్ణారావు పేర్కొన్నారు. బీసీ అభ్యర్థులు 2012 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2014 ఆగస్టు 31వ తేదీ మధ్యన, ఎస్సీఎస్టీ అభ్యర్థులైతే 2010 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2014 సెప్టెంబర్ 31వ తేదీ మధ్యన జన్మించి 2021-22, 2022-23 సంవత్సరాల్లో 3,4 తరగతులు చదివినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. వివరాలకు కరపలోని గురుకుల పాఠశాలలో సంప్రదించాలని ఆయన కోరారు.