Share News

వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:05 AM

కాకినాడరూరల్‌, డిసెంబరు 30: వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని.. అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్తిబాబు అన్నారు. తూరంగిలో శనివారం మనమందరం కలవాలి చంద్రన్నకు అండగా ని లవాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రా మంలోని తటస్థుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి టీడీపీ మేనిఫెస్టో ప్రతులను అందజేశారు. వైసీపీ ప్రభుత్వం ఏపీ

వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం

మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి

కాకినాడరూరల్‌, డిసెంబరు 30: వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని.. అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్తిబాబు అన్నారు. తూరంగిలో శనివారం మనమందరం కలవాలి చంద్రన్నకు అండగా ని లవాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రా మంలోని తటస్థుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి టీడీపీ మేనిఫెస్టో ప్రతులను అందజేశారు. వైసీపీ ప్రభుత్వం ఏపీని అప్పుల రాష్ట్రంగా మా ర్చిందన్నారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదలచేస్తామని తెలిపి గడిచిన నాలుగున్నరేళ్లలో ఒక్కజాబ్‌ క్యాలెండర్‌ విడుదలచేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ప్రజల మద్దతుతో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీడీపీ నాయకులు మిరపల సూర్యప్రకాష్‌, జక్కి అప్ప న్న, యాసలపు కన్నబాబు, ప్రసాద్‌ శర్మ, గణేష్‌ కుమార్‌, పెద్దరాజు, సత్తిరాజు, వెంకటరమణ, శ్రీను, భవానీ,సాంబశివరావు, గాయత్రి, లక్ష్మీ, వీ రబాబు, నర్సింగరావు, చల్మాజీ,ప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:05 AM