వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:20 AM
సర్పవరం జంక్షన్, డిసెంబరు 22: నారా లోకేశ్ యువగళం-నవశకం బహిరంగ సభకు తరలివచ్చిన అశేష అశేష జనసందోహాన్ని చూచి జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా పోయింది. యువగళం ప్రజా సునామీలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి తెలిపారు. శుక్రవారం వలసపాకల స్వగృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ బ
మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి
సర్పవరం జంక్షన్, డిసెంబరు 22: నారా లోకేశ్ యువగళం-నవశకం బహిరంగ సభకు తరలివచ్చిన అశేష అశేష జనసందోహాన్ని చూచి జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా పోయింది. యువగళం ప్రజా సునామీలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి తెలిపారు. శుక్రవారం వలసపాకల స్వగృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ బలోపేతంతో చంద్రబాబును సీఎంగా చేసే కార్యక్రమంలో భాగంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం నుంచి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మన మందరం కలవాలి- చంద్రన్నకు అండగా నిలవాలి-తటస్థులతో మీ అనంతలక్ష్మి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు ప్లకార్డుల ను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు పెంకే వీరబాబు, కాళ్ల శ్రీను, బొజ్జ భవానిసాంబశివరావు, ఏడుకొండలు, కింతాడ శేఖర్,, గుత్తుల లక్ష్మి, గు బ్బల సత్తిబాబు, కొల్లుబోయిన అత్చుత్ ఉన్నారు.