వంట గ్యాస్ ధర పెంపుతో పెనుభారం
ABN , First Publish Date - 2023-03-02T00:07:00+05:30 IST
ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచడంతో పేద, మధ్యతరగతి వర్గాలపై మరోసారి పెనుభారం పడిందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సత్తిబాబు అన్నారు. పెనుగుదురులో బుధవారం టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ మీఅనంతలక్ష్మి, ఇదేంఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు వైసీపీ ప్రభుత్వం అరాచకాలు ఎక్కువైపోతున్నాయని, సంక్షేమం మాటున నిత్యవసరాల ధరలను అంతకంతకు పెంచుతూ ప్రజలను దోచుకుంటుందని విమ
మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి
పెనుగుదురు (కరప), మార్చి 1: ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచడంతో పేద, మధ్యతరగతి వర్గాలపై మరోసారి పెనుభారం పడిందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సత్తిబాబు అన్నారు. పెనుగుదురులో బుధవారం టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ మీఅనంతలక్ష్మి, ఇదేంఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు వైసీపీ ప్రభుత్వం అరాచకాలు ఎక్కువైపోతున్నాయని, సంక్షేమం మాటున నిత్యవసరాల ధరలను అంతకంతకు పెంచుతూ ప్రజలను దోచుకుంటుందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి రూ.600 ఉన్న గ్యాస్ ధర ప్రస్తు తం రూ.1,200కు పెరిగిపోయిందన్నారు. పెరుగుతున్న ధరలను అదుపుచేయలేని అసమర్ధ వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని సాగనంపి టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందజేసి వైసీపీ వైఫల్యాలను వివరించారు. మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ కార్యక్రమంలో జడ్పీటీసీ బుంగా సింహాద్రి, కోటగిరి మహేంద్రబాబు, కాకర్ల బుజ్జిబాబు, గండి వెంకటేశ్వరరావు, పులపకూర మహేష్, యలమంచిలి సుకుమార్, బండారు వెంకటేశ్వరరావు, దాసరి వీరబాబు, మట్టపర్తి కొండ, రెడ్డి సత్యనారాయణ, మేడిశెట్టి పట్టాభి, పంపన కన్నారావు, యనమదల దొరబాబు వెంకటలక్ష్మి, బొజ్జ భవాని, గుత్తుల లక్ష్మి, కోన వెంకటలక్ష్మి, గంజా రాంబాబు పాల్గొన్నారు.