కాకినాడ రూరల్లో కొవిడ్ కేసు నమోదు
ABN , First Publish Date - 2023-03-19T02:38:19+05:30 IST
ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది.

సర్పవరం జంక్షన్, మార్చి 18: ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కాకినాడరూరల్ మండలంలో ఒక కొవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. దాంతో వారంరోజుల వ్యవధిలో ఇద్దరు కొవిడ్ బారిన పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట సచివాలయం-3 పరిధికి చెందిన 21 ఏళ్ల యువతి గ్వాలియర్‌లో డిగ్రీ విద్యాభ్యాసం చేస్తోంది. ఈనెల 15న తల్లి ఇంటికి వచ్చింది. అప్పటికే జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉండటంతో తూరంగి పీహెచ్‌సీలో కొవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోగా 17న పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దాంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న ముగ్గురిని వైద్య ఆరోగ్య సిబ్బంది ట్రేసిం గ్ చేసి టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చింది. బాధితురాలి ఇంటి పరిసర ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి దవులూరి వెంకటరమణ ప్రత్యేక శానిటేషన్ చేయించారు.