గొల్లప్రోలులో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2023-07-28T00:21:23+05:30 IST

గొల్లప్రోలు, జూలై 27: గొల్లప్రోలు జగనన్న కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి, బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని కాకినాడ ఆర్డీవో ఎన్‌వీవీ.స

గొల్లప్రోలులో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు
గొల్లప్రోలులో వరద నీటిని పరిశీలిస్తున్న ఆర్డీవో

కాకినాడ ఆర్డీవో సత్యనారాయణ

గొల్లప్రోలు, జూలై 27: గొల్లప్రోలు జగనన్న కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి, బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని కాకినాడ ఆర్డీవో ఎన్‌వీవీ.సత్యనారాయణ తెలిపారు. పట్టణ శివారులోని జగనన్న కాలనీకి వెళ్లే రహదారిపై నాలుగు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న సుద్దగడ్డ వరద నీటిని ఆయన గురువారం పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు అవసరమై తాగునీరు, వైద్య సదుపా యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాలనీ వాసుల ఇబ్బందుల పరిష్కారానికి అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. ఆయన వెంట గొల్లప్రోలు తహసీల్దారు వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ ప్రభుకుమార్‌ తదితరులు ఉన్నారు.

రుణాలు అందించాలి

గొల్లప్రోలు రూరల్‌, జూలై 27: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో కౌలురైతులందరికీ రుణాలు అందించే లా బ్యాంకర్లు చొరవ తీసుకోవాలని ఆర్డీవో సత్యనారాయణ సూచించారు. గొల్లప్రోలు మండలపరిషత్‌ కార్యాలయంలో కౌలుదారు సాగుహక్కు ధ్రువీకరణపత్రాలు, రుణాల మంజూరుపై ఆయ న సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్‌లో 34వేల సాగుదారు పత్రాలకు 23వేల పత్రాలు, గొల్లప్రోలు మండలంలో 3,407మంది కౌలురైతులకు 2474మందికి పత్రాలు అందించామ న్నారు. వ్యవసాయశాఖ ఏడీ పి.స్వాతి, ఎంపీడీవో డీఎల్‌.శర్మ,తహశీల్దార్‌ వెంకటేశ్వరరావు ఉన్నారు.

Updated Date - 2023-07-28T00:21:23+05:30 IST