కాకినాడకు జనసేనాని
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:57 AM
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జిల్లా పర్యటనకు రాబోతున్నారు. మూడురోజులపాటు జిల్లా కేంద్రం కాకినాడలో బసచేయనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో అసెంబ్లీ స్థానాల వారీగా ఇన్‌చార్జ్‌లు, కీలక నేత లతో సమీక్షించనున్నారు. జిల్లాలో ఏయే స్థానంలో బలం ఎంత అనే దానిపై బేరీజు వేయనున్నారు.
మూడురోజులపాటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటన
కాకినాడలోని ఓ హోటల్లో బస
28, 29, 30వ తేదీల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాలపై అంతర్గత సమీక్ష
స్థానాలవారీగా బలాబలాలపై బేరీజు వేయనున్న జనసేన అధినేత
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జిల్లా పర్యటనకు రాబోతున్నారు. మూడురోజులపాటు జిల్లా కేంద్రం కాకినాడలో బసచేయనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో అసెంబ్లీ స్థానాల వారీగా ఇన్‌చార్జ్‌లు, కీలక నేత లతో సమీక్షించనున్నారు. జిల్లాలో ఏయే స్థానంలో బలం ఎంత అనే దానిపై బేరీజు వేయనున్నారు. ఇందుకోసం ఈ నెల 28, 29, 30 తేదీల్లో కాకినాడలోని ఓ హోటల్లో బస చేయనున్నారు. తొలుత 27వతేదీనే పర్యటన ఉండాల్సిఉన్నా కొన్ని కారణాలతో మరుసటిరోజునుంచి పర్యటనను ప్రారంభించాలని పవన్ నిర్ణయించినట్లు తెలిసింది. పర్యటన తేదీలపైనా, మూడురోజుల షెడ్యూల్‌పైనా కసరత్తు చేపట్టిన జ నసేన మంగళవారం రాత్రి నాటికి అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసే అవకాశంఉందని పార్టీ వర్గలు పేర్కొన్నాయి.
మొదటి విడత వారాహి ఇక్కడినుంచే..
వారాహి తొలి విడత యాత్రకు జనసేనాని పవన్‌కల్యాణ్ కాకినాడ జిల్లాకు ఈ ఏడాది జూన్‌లో వచ్చారు. ఉభయ గో దావరి జిల్లాల్లో ఎట్టిపరిస్థితుల్లోను వైసీపీ ఒక్క సీటు కూ డా గెలవకూడదన్న దృఢసంకల్పంతో వైసీపీ ప్రభుత్వ వైఫ ల్యాలపై, ప్రజావ్యతిరేక విధానాలపై, అధికార పార్టీ ఎమ్మె ల్యేల అవినీతిపై ఆయన తీవ్రమైన దాడి చేశారు. కాకినాడ జిల్లాలో వారాహి యాత్ర మొత్తం ద్వారంపూడి లక్ష్యంగా అనేక విమర్శలు చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో జరిగిన నియోజకవర్గాల వారీ యాత్ర మొత్తం ఇదే పంధా కొనసాగించారు. అప్పట్లో ఆయన ప్రసంగాలతో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.
టీడీపీతో పొత్తు తర్వాత మొదటిసారి
ఆరు నెలల తర్వాత జనసేన అధినేత మళ్లీ ఇప్పుడు జిల్లాకు వస్తుండడంతో ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మూడురోజులపాటు కాకినాడ వేదికగా పవన్ సమీక్షలు చేయనున్నారని సమాచారం. దీంతో రాజకీయం గా ఆసక్తి రేపుతోంది. టీడీపీతో పొత్తు తర్వాత మొదటిసారి జిల్లాకు పవన్‌కల్యాణ్ రానున్నారు. ఈ జిల్లాల్లో జనసేన ఏఏ స్థానాల్లో పోటీ చేస్తుందనే ఆసక్తి అందరిలోను ఉంది. రెండు స్థానాల్లో పోటీకి దిగుతుందనే ప్రచారం జరుగుతోం ది. ఆ స్థానాలు ఏవి అనేదానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పవన్ కాకినాడలో మకాం వేసి నియోజకవర్గాలవారీగా సమీక్ష చేయడం ద్వారా ఏ స్థానంలో ఎవరు బరిలోకి దిగే అవకాశం ఉందో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నా యి. ఇటు జిల్లాలో పలువురు టీడీపీ ఇన్‌చార్జ్‌లు కూడా మ ర్యాదపూర్వకంగా పవన్‌ను కలవనున్నట్లు సమాచారం.