అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు : ఎంపీ

ABN , First Publish Date - 2023-09-30T00:13:19+05:30 IST

కాకినాడ సిటీ, సెప్టెంబరు 29: రాజకీయా లతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజల బాగోగుల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. వైఎస్సాఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా అర్హులైన సొంత ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌,

అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు : ఎంపీ
వాహన మిత్ర చెక్కు అందజేస్తున్న ఎంపీ, కలెక్టర్‌

కాకినాడ సిటీ, సెప్టెంబరు 29: రాజకీయా లతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజల బాగోగుల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. వైఎస్సాఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా అర్హులైన సొంత ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌, ఎండీయూ వాహన డ్రైవర్లకు ఐదో విడతలో రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ శుక్రవారం విజయవాడలో ప్రారంభించగా ఈ పథకానికి సంబంధించి జిల్లాస్థాయి కార్యక్రమం జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ సూర్య కళామందిరంలో జరిగింది. ఎంపీ, కలెక్టర్‌ కృతి కాశుక్లా, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్‌ సుంకర శివప్రసన్న, రాష్ట్ర రైస్‌ మిల్లర్ల సంఘ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కాకినాడ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పసుపులేటి వెంకటలక్ష్మి, డీటీసీ ఎ.మోహన్‌ హాజరయ్యారు. మెగా చెక్కును లబ్ధి దారులకు అందజేశారు. ఆటో యూనియన్ల ప్రతినిధులు, వివిధ ప్రాంతాల లబ్ధిదారులు, రవాణాశాఖ అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-09-30T00:13:19+05:30 IST