Share News

సమాజ సేవ పట్ల ఆసక్తి కనబర్చాలి

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:03 AM

జేఎన్టీయూకే, డిసెంబరు 22: విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు సమాజసేవ పట్ల ఆసక్తి కనబర్చాలని జేఎన్టీయూకే ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు అన్నారు. వర్సిటీలోని అలూమ్ని ఆడిటోరియంలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ టెక్నాలజీ(ఐఎస్‌టీ) వార్షిక వేడుకలను శుక్రవారం నిర్వహించారు. వీసీ ప్రసాదరాజు ముఖ్యఅతిథిగా, డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ విశిష్ట అతిథిగా, గౌరవ అతిథులుగా రెక్టార్‌ కేవీరమణ, రిజిస్ట్రార్‌ ఎల్‌.సుమలత, జీవీఎస్‌ఆర్‌ దీక్షితులు పాల్గొన

సమాజ సేవ పట్ల ఆసక్తి కనబర్చాలి

జేఎన్టీయూకే వీసీ ప్రసాదరాజు

జేఎన్టీయూకే, డిసెంబరు 22: విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు సమాజసేవ పట్ల ఆసక్తి కనబర్చాలని జేఎన్టీయూకే ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు అన్నారు. వర్సిటీలోని అలూమ్ని ఆడిటోరియంలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ టెక్నాలజీ(ఐఎస్‌టీ) వార్షిక వేడుకలను శుక్రవారం నిర్వహించారు. వీసీ ప్రసాదరాజు ముఖ్యఅతిథిగా, డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ విశిష్ట అతిథిగా, గౌరవ అతిథులుగా రెక్టార్‌ కేవీరమణ, రిజిస్ట్రార్‌ ఎల్‌.సుమలత, జీవీఎస్‌ఆర్‌ దీక్షితులు పాల్గొనగా ఐఎస్‌టీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఏ.గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రా రంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆధునిక జీవితంలోని సామాజిక, సాంకేతిక మార్పులను అధిగమించినపుడే విద్యార్థులు సునాయాసంగా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చన్నారు. అనంతరం డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ సమాజం లో డబ్బులేకపోయినా సేవ చేయవచ్చునన్నారు. చంద్రశేఖర్‌ను సన్మానించారు. ఈ స ందర్భంగా నిర్వహించిన పలు క్రీడాపోటీల్లో విజేతలకు ప్రతిభాపత్రాలను, బహుమతులను అతిథులు అందజేశారు. డైరెక్టర్లు, ప్రత్యేకాధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:03 AM