ముందస్తు సాగుతో సత్ఫలితాలు
ABN , First Publish Date - 2023-06-09T00:25:08+05:30 IST
కరప, జూన్ 8: ముందస్తు సాగుతో రైతులు సత్ఫలితాలు సాధిస్తారని, యంత్రాంగం ఆ దిశ గా పనిచేసి వారిని ముందస్తు సాగుకు సమాయత్తంచేయాలని వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎన్.విజయ్‌కుమార్ సూచించారు. కరప చంద్రన్న సమావేశ మందిరంలో గురువారం కరప
జేడీఏ విజయ్‌కుమార్
కరప, జూన్ 8: ముందస్తు సాగుతో రైతులు సత్ఫలితాలు సాధిస్తారని, యంత్రాంగం ఆ దిశ గా పనిచేసి వారిని ముందస్తు సాగుకు సమాయత్తంచేయాలని వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎన్.విజయ్‌కుమార్ సూచించారు. కరప చంద్రన్న సమావేశ మందిరంలో గురువారం కరప సబ్‌డివిజన్ పరిధిలోని కరప, కాజులూరు, తాళ్లరేవు మండలాలకు చెందిన ఏవోలు, ఏఈవోలు, వీఏఏలతో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయశాఖ సలహాలు, సూ చనలు పాటిస్తూ పక్కా కార్యాచరణ ప్రకారం సాగు చేపడితే రైతులకు అన్ని విధాల లాభం చేకూరుతుందన్నారు. అక్టోబరు నెలాఖరు కల్లా కోతలు పూర్తయ్యేలా ఈనెల 15కల్లా ఖరీఫ్ నాట్లు వేసేలా చూడాలన్నారు. నవంబరు 15 నుంచి డిసెంబరు 15లోగా రబీ నాట్లు పూర్తిచేసి మార్చి నెలాఖరు కల్లా కోతలు పూర్తయితే మూడో పంటగా అపరాల సాగు సాధ్యమవుతుందన్నారు. కరప సబ్‌డివిజన్ ఏడీఏ కె.బాబూరావు రూపొందించిన ముందస్తు సాగు కార్యాచరణ ప్రణాళిక కరదీపికను జేడీఏ ఆవిష్కరించి సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం డీడీ బీవీఎ్‌స సీ.హరి, ఏవోలు అప్పసాని వెంకటరాజేష్, వి.అశోక్, ఎన్.ప్రశాంతి, బీసీఎల్ ఏవో సీహెచ్. పావని, బీఎ్‌ఫఎల్ ఏవో సీహెచ్.పద్మ ఉన్నారు.