‘బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం’
ABN , First Publish Date - 2023-11-21T00:54:58+05:30 IST
కాకినాడ సిటీ, నవంబరు 20: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాద ఘట నలో దగ్ధమైన బోట్ల బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మా

కాకినాడ సిటీ, నవంబరు 20: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాద ఘట నలో దగ్ధమైన బోట్ల బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. సోమవారం విశాఖపట్నం వెళ్లిన కొండబాబు మాజీమంత్రి కొల్లు రవీంద్రతో కలిసి దగ్ధమైన బోట్ల బాధితులను పరామర్శించారు. ప్రమాద ఘటనపై బోటు యజమానులతో చర్చించి బాధిత కుటుం బాలకు అండగా ఉంటామని ఽభరోసా ఇచ్చారు. మత్స్యకార బాధితులకు నూరుశాతం నష్టపరిహారం ఇవ్వాలని, బోట్లు కట్టుకోవాలంటే ఏడాది పడుతుంది కాబట్టి, అంతవరకు వీటిపై బాధితులకు రేషన్ ఇచ్చి ఆదుకోవాలని కొండబాబు కోరారు.