వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి

ABN , First Publish Date - 2023-09-17T00:09:12+05:30 IST

కాకినాడ సిటీ, సెప్టెంబరు 16: చంద్రబాబు అరెస్టుతో వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం నవ్వులపాలైందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొం డబాబు అన్నారు. బాబుకు తోడుగా మేము సైతం అంటూ మైనారిటీ వర్గాలు బాలాజీచెరువు సెంటర్‌ వద్ద చేస్తున్న రిలే నిరాహారదీక్షలను శనివారం టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ విచ్చేసి ప్రారంభించా

వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి
కాకినాడలో మాట్లాడుతున్న కొండబాబు

మాజీ ఎమ్మెల్యే వనమాడి కొం డబాబు

కాకినాడ సిటీ, సెప్టెంబరు 16: చంద్రబాబు అరెస్టుతో వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం నవ్వులపాలైందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొం డబాబు అన్నారు. బాబుకు తోడుగా మేము సైతం అంటూ మైనారిటీ వర్గాలు బాలాజీచెరువు సెంటర్‌ వద్ద చేస్తున్న రిలే నిరాహారదీక్షలను శనివారం టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండబాబు మా ట్లాడుతూ జగన్‌ ఒత్తిడితోనే సీఐడీ అధికారులు చం ద్రబాబుపై కేసులు బనాయించి జైలుకు తరలించి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ఎంఏ తాజుద్దీన్‌, ఎస్‌కే రహీమ్‌, ఎస్‌కే బాబుల్‌, అశ్రిఫ్‌ ఆలీ ఎండీ అన్సర్‌, ఎస్‌కే ముర్తజ, ఎంఏ సయ్యద్‌, ఎండీ జిలాని, గౌస్‌ మొహిద్దీన్‌ పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది జవహర్‌ఆలీ, టీడీపీ నాయకుడు వాసంశెట్టి సత్య దీక్ష శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కొండబాబు టీడీపీ శ్రేణులతో కలిసి జగన్నాథపురం ఆజామ్‌ మసీద్‌ నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌, ఎంఏ తాజుద్దీన్‌, వొమ్మి బాలాజీ, ఎండీ అన్సర్‌, మీసాల సునీత, దండుప్రోలు నాగబాబు, నీలకాయల సన్ని, జొన్నాడ వెంకటరమణ, గుత్తుల రమణ పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో అక్రమ కేసుల నుంచి చంద్ర బాబు బయటకు రావాలని కోరుతూ కొండబాబు ఆధ్వర్యంలో పలు దేవాలయాల్లో తెలుగు మహిళలు పూజలు నిర్వహించారు. మహిళా నాయకురాళ్లు చిక్కాల సత్యవతి, తుమ్మల సునీత, కొల్లు కుమారి, రిక్కా లక్ష్మి, పీర్ల లక్ష్మీపసన్న, దేవు జయలక్ష్మి, మూగు చిన్ని, కుసుమ కుమారి, బత్తుల ఉమాదేవి పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జిల్లా తెలుగు మహిళాధ్యక్షురాలు సుంకర పావని తెలుగు మహిళలతో కలిసి సంతచెరువు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నల్ల జెండాలు, ప్లకార్డులు చూపుతూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన ప్రభంజనంతో వైసీపీ భూస్థాపితం అవుతుందన్నారు.

Updated Date - 2023-09-17T00:09:12+05:30 IST