Share News

అర్హులను గుర్తించాలి : డీపీవో

ABN , First Publish Date - 2023-11-25T23:36:25+05:30 IST

సర్పవరం జంక్షన్‌, నవంబరు 25: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి కూడా లబ్ధిపొందని అర్హులను గుర్తించాలని జిల్లా పంచాయతీ అధికారిణి కె.భారతి సౌజన్య కోరారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా శనివారం డీఎల్డీవో పి.నారాయణమూర్తి ఆధ్వర్యంలో రమణయ్యపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడు

అర్హులను గుర్తించాలి : డీపీవో
ప్రతిజ్ఞలో పాల్గొన్న డీపీవో భారతి సౌజన్య

సర్పవరం జంక్షన్‌, నవంబరు 25: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి కూడా లబ్ధిపొందని అర్హులను గుర్తించాలని జిల్లా పంచాయతీ అధికారిణి కె.భారతి సౌజన్య కోరారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా శనివారం డీఎల్డీవో పి.నారాయణమూర్తి ఆధ్వర్యంలో రమణయ్యపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు, నిర్వహణపై కియాస్కీల ద్వారా ప్రచారం నిర్వహించేందు కు ప్రత్యేక ప్రణాళికతో అధికారులు ముందుకెళ్లాలని కోరా రు. అర్హత ఉండి కూడా లబ్ధిపొందకపోతే కారణాలు తెలుసుకుని, మళ్లీ వారు లబ్ధిపొందేలా కృషి చేయాల్సిన బాధ్య త అధికార యంత్రాంగంపై ఉందన్నారు. సంక్షేమ పథకాలపై విద్యార్థులతో క్విజ్‌ పోటీలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కర్రె స్వప్న, గ్రామ సెక్రటరీ దవులూరి వెంకటరమణ, శ్రీనివాస్‌, ఈవోపీఆర్‌డీ ఆంజనేయులు తదితర అధికారులున్నారు.

Updated Date - 2023-11-25T23:36:26+05:30 IST