‘నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి’
ABN , First Publish Date - 2023-11-10T23:40:25+05:30 IST
ప్రత్తిపాడు, నవంబరు 10: జిల్లాలోని డీలర్లు, వ్యాపార దృక్పథంతో కాకుండా సేవేధ్యేయంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించాలని జిల్లా వ్యవసాయసంయుక్త సంచాలకుడు ఎన్.విజయ్‌కుమార్ కోరారు. ఏలేశ్వరం విశ్వనాధుని వేదిక ఫంక్షన్‌హాల్లో శుక్రవారం జగ్గంపేట వ్యవసాయ
ప్రత్తిపాడు, నవంబరు 10: జిల్లాలోని డీలర్లు, వ్యాపార దృక్పథంతో కాకుండా సేవేధ్యేయంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించాలని జిల్లా వ్యవసాయసంయుక్త సంచాలకుడు ఎన్.విజయ్‌కుమార్ కోరారు. ఏలేశ్వరం విశ్వనాధుని వేదిక ఫంక్షన్‌హాల్లో శుక్రవారం జగ్గంపేట వ్యవసాయ సబ్ డివిజన్‌పరిధిలోని పలు మండలాల డీలర్లు, వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఏలు, ఏఈలతోప్రత్యేక సమావేశం నిర్వహించారు. జేడీఏ మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసి నా, నిబంధనలు అతిక్రమించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు అం శాలను డీడీఏ బి.హరి, ఏడీఏ పి.మాధవి వివరించారు. సమావేశంలో జగ్గంపేట సర్కిల్ సబ్ డివిజన్ ఏడీఏ వైవీ గంగాధర్, 4 మండలాల ఏవోలు శ్రీరాం, పి.జ్యోతి, సద్గురుమూర్తి, టెక్నికల్ ఏవోలు గాయిత్రి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.