పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం
ABN , First Publish Date - 2023-05-02T01:01:25+05:30 IST
కార్పొరేషన్ (కాకినాడ), మే 1: ప్రజారోగ్య పరిరక్షణ కోసం కష్టపడి పనిచేసే పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని నగరపాలకసంస్థ కమిషనర్ డాక్టర్ మహే్‌షకుమార్ రావిరాల అన్నారు. కార్మికులు విధి నిర్వహణలో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై 15రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావుతో
కాకినాడ కమిషనర్ మహే్‌షకుమార్
కార్పొరేషన్ (కాకినాడ), మే 1: ప్రజారోగ్య పరిరక్షణ కోసం కష్టపడి పనిచేసే పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని నగరపాలకసంస్థ కమిషనర్ డాక్టర్ మహే్‌షకుమార్ రావిరాల అన్నారు. కార్మికులు విధి నిర్వహణలో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై 15రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావుతో కలిసి ఈ అంశంపై కార్పొరేషన్ అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిషనర్ సమావేశమయ్యారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో 1200 మంది కార్మికులు పనిచేస్తుండగా వీరికి మెడికల్ క్యాంపుల నిర్వహణతోపాటు తీసుకుంటున్న ఇతర చర్యలపై దృష్టిపెట్టాలని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ వివరించారు. డీఈ మాధవి, ప్రొఫెసర్ డాక్టర్ దేవిమాదురి పాల్గొన్నారు. తుఫాను వరదలు సంభవించినప్పుడు ఆకస్మికంగా ఎదురయ్యే విపత్తులను అన్ని శాఖల సమన్వయంతో సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కమిషనర్ మహే్‌షకుమార్ సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ నాగనరసింహరావు, పలుశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో ఉం చుకుని భవిష్యత్తులో తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. నగర పాల కసంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కమిషనర్ వినతులు స్వీకరించారు.