తొండంగి మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
ABN , First Publish Date - 2023-06-07T00:28:37+05:30 IST
తొండంగి, జూన్ 6: జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా మండలంలో మంగళవారం సుడిగాలి పర్యటన జరిపారు. పెరుమాళ్ళపురంలో ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన ఆమె అ నంతరం ఏవినగరం, కోదాడ, కొమ్మనాపల్లి, రావికంపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కోదాడలో జమ్మేరు ఆధునికీకరణ పనులు పరిశీలించా
తొండంగి, జూన్ 6: జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా మండలంలో మంగళవారం సుడిగాలి పర్యటన జరిపారు. పెరుమాళ్ళపురంలో ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన ఆమె అ నంతరం ఏవినగరం, కోదాడ, కొమ్మనాపల్లి, రావికంపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కోదాడలో జమ్మేరు ఆధునికీకరణ పనులు పరిశీలించారు. ఏవినగరంలో జగన న్న గృహనిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కొమ్మనాపల్లిలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులను, రావికంపాడు ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పథక పనులను పరిశీలించారు. ఆమె వెంట హౌసింగ్ పీడీ సుధాకర్ పట్నాయక్, డీఈవో అన్నపూర్ణ, ఆర్డీవో సీతారామారావు, ఎంఈవో షేక్‌బాబ్జి, ఎంపీడీవో సతీష్ పాల్గొన్నారు.