గృహనిర్మాణ పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-08-08T23:44:18+05:30 IST

సామర్లకోట, ఆగస్టు 8: సామర్లకోట ఈటీసీ లేఅవుట్‌లో పేదలందరికీ ఇళ్లు కాలనీలో సీఎం జగన్‌ ఈనెలలో పర్య టించి పైలాన్‌ను అవిష్కరించనున్నందున గృహనిర్మాణ, మౌలిక సదుపాయాల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా, జేసీ ఇలాక్కియా అధికారులను ఆదేశిం చా

గృహనిర్మాణ పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్‌
సామర్లకోటలో పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌

సామర్లకోట, ఆగస్టు 8: సామర్లకోట ఈటీసీ లేఅవుట్‌లో పేదలందరికీ ఇళ్లు కాలనీలో సీఎం జగన్‌ ఈనెలలో పర్య టించి పైలాన్‌ను అవిష్కరించనున్నందున గృహనిర్మాణ, మౌలిక సదుపాయాల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా, జేసీ ఇలాక్కియా అధికారులను ఆదేశిం చారు. సామర్లకోట లేఅవుట్‌ వద్ద మంగళవారం వివిధ శాఖల అధికారులతో వారు సమీక్షించారు. లబ్ధిదారుల జాబి తాలను పరిశలించి ఆయా గృహాలు ఏదశలో ఉన్నాయో తెలుసుకున్నారు. పట్టా పొందిన ప్రతీ లబ్ధిదారుడు ప్రభుత్వ రుణసదుపాయంతో ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోవాలని, ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాల న్నారు. అంతర్గత రోడ్లు, డ్రైన్లు, విద్యుత్‌, తాగునీటి కుళాయి లు తదితర మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు వేగం పెంచాలన్నారు. సమావేవంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, కాకినాడ ఆర్డీవో ఎన్‌.సత్యనా రాయణ, హౌసింగ్‌ పీడి సుధాకర్‌ పట్నాయక్‌, డీఎల్డీవోలు పాటంశెట్టి నారాయణమూర్తి, కెఎస్‌.ప్రసాద్‌, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి, మెప్మా పీడి శ్రీరమణి, తహశీల్దార్లు ఎస్‌.కుమారి, వజ్రపు జితేంద్ర, ఎంపీడీవో డి.శ్రీలలిత, మున్సి పల్‌ కమిషనర్‌ జె.రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-08T23:44:18+05:30 IST