కార్మికులకు సంక్షేమ చట్టాలు అమలుచేయాలి

ABN , First Publish Date - 2023-02-19T00:33:13+05:30 IST

పారిశ్రామిక ప్రమాదాలను నివారించి, కార్మికులకు సంక్షేమ చట్టాలు అమలుచేయాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి అన్నారు. శనివారం కాకినాడ ఎన్జీవో హోమ్‌లో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి దువ్వా శేషబాబ్జి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా శేషబాబి మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువా

కార్మికులకు సంక్షేమ చట్టాలు అమలుచేయాలి
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి

పోర్టుసిటీ (కాకినాడ), ఫిబ్రవరి 18: పారిశ్రామిక ప్రమాదాలను నివారించి, కార్మికులకు సంక్షేమ చట్టాలు అమలుచేయాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి అన్నారు. శనివారం కాకినాడ ఎన్జీవో హోమ్‌లో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి దువ్వా శేషబాబ్జి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా శేషబాబి మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమ తనిఖీలను నిలుపుదల చేయడంతో, పరిశ్రమల యాజమాన్యా లు ఇష్టానుసారంగా నైపుణ్యం లేని కార్మికులతో ప్రమాద భరిత ప్రాం తాల్లో పనిచేయించడం వల్ల ప్రమాదాలు జరిగి అన్యాయంగా కార్మికులు చనిపోతున్నారని తక్షణం పరిశ్రమల్లో తనిఖీలను తరచుగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అలాగే పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ప్రతీ పరిశ్రమలో తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీమేరకు అన్ని పరిశ్రమల్లో 80 శాతం స్థానికులకు ఉపాధి కల్పించాలని, వలస కార్మికుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, ఏఐటీయూ సీ జిల్లా నాయకుడు పీఎ్‌స.నారాయణ, ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి పిట్టా వరప్రసాద్‌, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి బోరకొం దళిత హక్కుల పోరాటకమిటీ నాయకుడు ఎస్‌.రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-19T00:33:14+05:30 IST