కడియం సీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-04-02T02:00:04+05:30 IST

కడియం సీహెచ్‌సీని శనివారం జిల్లా కలెక్టర్‌ డా. మాధవీలత సందర్శించారు. ముందుగా ఆస్పత్రిలో వార్డును సందర్శించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయి? సదుపాయాలు బాగున్నాయా ? అం టూ రోగులను అడిగారు. దీంతో రోగులు సదుపాయాలు బాగానే ఉన్నాయని తెలిపారు.

కడియం సీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్‌

కడియం, ఏప్రిల్‌ 1: కడియం సీహెచ్‌సీని శనివారం జిల్లా కలెక్టర్‌ డా. మాధవీలత సందర్శించారు. ముందుగా ఆస్పత్రిలో వార్డును సందర్శించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయి? సదుపాయాలు బాగున్నాయా ? అం టూ రోగులను అడిగారు. దీంతో రోగులు సదుపాయాలు బాగానే ఉన్నాయని తెలిపారు. ఇటీవల కడియం ఆంధ్రా పేపరుమిల్లు ఆస్పత్రి అభివృద్ధికి సుమా రు రూ.30 లక్షలు నిధులను అందజేశారు. వాటితో ఆస్పత్రికి పలు వైద్యయంత్రాలు, వైద్యపరికరాలు కొనుగోలు చేశారు. జిల్లా కలెక్టర్‌ మాధవీలత డిజిటల్‌ రేడియోగ్రఫీ, బ్లడ్‌ ఆటో ఎనలైజర్‌, ఆపరేషన్‌ ఽథియేటర్‌లో వర్క్‌ స్టేషన్‌ ప్రారంభించారు. అనంతరం డిజిటల్‌ రేడియోగ్రఫీ, బ్లడ్‌ ఆటోఎనలైజర్‌ మిషన్లు పనితీరు, రోగులకు వాటి ద్వారా అందే సదుపాయాలు గురించి డా. టి.వి. శ్రీధర్‌ను అడిగారు. కార్యక్రమంలో రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌, రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, దొడ్డా బుజ్జి, గణేష్‌, ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, తిరుమలశెట్టి శ్రీను, లావేటి రమేష్‌, డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పటల్‌ సర్వీసెస్‌ సనత్‌కుమారి, వైద్యులు, పలువురు అధికారులు ఉన్నారు.

Updated Date - 2023-04-02T02:00:04+05:30 IST