Share News

కాపులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీల అమలు చేయాలి

ABN , Publish Date - Dec 30 , 2023 | 01:39 AM

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు29 : కాపు సామాజిక వర్గానికి సీఎం జగన్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, కాపుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్‌కి ఏడాదికి రూ.2 వేల కోట్లు వం తున అయిదేళ్లకు రూ. 10 వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో జనవరి 3న విజయవాడలో జరిగే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రత్యక్ష కార్యాచరణకు భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తామని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు తెలిపారు. శుక్రవారం కా

కాపులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీల అమలు చేయాలి
కాపు జేఏసీ సమావేశంలో ఐక్యతను చాటుతున్న నేతలు

జనవరి 3న విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం : కాపు జేఏసీ

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు29 : కాపు సామాజిక వర్గానికి సీఎం జగన్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, కాపుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్‌కి ఏడాదికి రూ.2 వేల కోట్లు వం తున అయిదేళ్లకు రూ. 10 వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో జనవరి 3న విజయవాడలో జరిగే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రత్యక్ష కార్యాచరణకు భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తామని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు తెలిపారు. శుక్రవారం కాకినాడ విద్యుత్తునగర్‌లో వెంకన్నబాబు ఫంక్షన్‌ హాల్లో రాష్ట్ర కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల జేఏసీ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్ల విష్ణుమూర్తి, ఆరేటి ప్రకాశ్‌, చందు జనార్థన్‌లు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో కాపులకు ఈడబ్ల్యూ ఎస్‌ కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ జారీ చేసిన జీవో ప్రకా రం తక్షణమే అమలుచేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. నూతన జిల్లాలకు వంగవీటి మోహనరంగా, పెరియార్‌ రామస్వామి, కన్నెగంటి హనుమంతు, శ్రీకృష్ణదేవరాయుల పేర్లు పెట్టాలని కోరుతున్నామన్నారు. వెనుకబడిన వర్గాలుగా ఎఫ్‌ కేటగిరీలో రిజర్వేషన్‌ కల్పిస్తూ 33/ 2017 బిల్లు అమలుచేయాలన్నారు. కులా లవారీగా గణన చేపట్టి కాపు సామాజిక వర్గాల సంఖ్యను లెక్కించి, దామాసా ప్రకారం విద్య,ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు. సమావేశంలో సం ఘం గౌరవాధ్యక్షుడు బసవా ప్రభాకరరావు, దామిశెట్టి శ్రీను, అడబాల సత్యనారాయణ, జంక్షన్‌ బాబ్జి, కొప్పిశెట్టి శ్రీను, జ్యోతి వీరకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 01:39 AM