వచ్చేనెల 1 నుంచి అన్నవరం దేవస్థానంపై ప్లాస్టిక్‌ నిషేధం

ABN , First Publish Date - 2023-06-11T01:09:01+05:30 IST

అన్నవరం దేవస్థానంలో జూలై 1నుం చి ప్లాస్టిక్‌ వస్తువులను పూర్తిగా నిషేధించినట్లు.. కూల్‌డ్రింక్‌ షాపుదారులు, క్యాంటీన్‌ నిర్వాహకులు, ఇతర వ్యాపార లైసెన్స్‌ లీజుదారులతో శనివారం ఈవో ఆజాద్‌ సమావేశమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

వచ్చేనెల 1 నుంచి   అన్నవరం దేవస్థానంపై ప్లాస్టిక్‌ నిషేధం

లీజుదారుల సమావేశంలో స్పష్టం చేసిన ఈవో

అన్నవరం, జూన్‌ 10: అన్నవరం దేవస్థానంలో జూలై 1నుం చి ప్లాస్టిక్‌ వస్తువులను పూర్తిగా నిషేధించినట్లు.. కూల్‌డ్రింక్‌ షాపుదారులు, క్యాంటీన్‌ నిర్వాహకులు, ఇతర వ్యాపార లైసెన్స్‌ లీజుదారులతో శనివారం ఈవో ఆజాద్‌ సమావేశమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎమార్పీ ధరలకంటే అధికంగా వసూలుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కొండపైకి ఏవిధమైన వాటర్‌ప్యాకెట్లు, డిస్పాజబుల్‌ ప్లాస్టిక్‌ వస్తువులు తీసుకురాకుండా టోల్‌గేట్‌ వద్ద సెక్యూరిటీ సిబ్బందితో తనిఖీ చేయించి కొండపైకి అనుమతిస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరి పూర్తిగా నిషేధిస్తామని ఈవో వెల్లడించారు. సమావేశంలో ట్రస్టీ పేరూరి బద్రీనారాయణ పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై నమూనాలయం నిర్మాణానికి టెండర్‌ ఖరారు

జాతీయ రహదారిపై రాజమహేంద్రవరం వైపు వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం కోసం దేవస్థానం స్థలంలో నిర్మించనున్న నమూనాలయం, రిటైనింగ్‌వాల్‌, గ్రావెల్‌ ఫిల్లింగ్‌, ప్రసాదం కౌంటర్‌ నిర్మా ణం, ఫుడ్‌ప్లాజా, టాయిలెట్‌ బ్లాక్స్‌ నిర్మాణానికి పిలిచిన టెండర్‌ను ఆదివారం దేవదాయమంత్రి, కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి టెండర్‌ ఖరారు చేయనున్నట్లు ఈవో ఆజాద్‌ తెలిపారు. రూ. 3.44 కోట్ల అంచనాతో టెండర్లను పిలవగా 4.95 శాతం అధికంతో రూ.3.59 కోట్లతో ఎల్‌ 1 కొట్‌ చేయడంతో దేవస్థానం ట్రస్టీ పేరూరి బద్రీనారాయణ ఇతరుల సమక్షంలో దానిని ఆమోదించినట్లు ఈవో పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారం భించి త్వరితగతిన పూర్తి చేస్తామని గుత్తేదారు అధికారులకు తెలిపారు.

Updated Date - 2023-06-11T01:09:01+05:30 IST