29న వికాస కార్యాలయంలో జాబ్‌మేళా
ABN , First Publish Date - 2023-05-27T00:15:46+05:30 IST
కాకినాడ సిటీ, మే 26: కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని వికాస కార్యాలయంలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వికాస పీడీ కె.లచ్చారావు తెలిపారు. ఈ జాబ్‌మేళాలో బజాజ్ కేపిటల్ కంపెనీలో టెలీకాలర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, జియోఫైబర్ కంపెనీలో ఫైబర్ ఇంజనీర్, పాయింట్ అసిస్టెంట్ మేనేజర్, యూ బ్రాడ్ బాండ్ ఇండియా లిమిటెడ్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, హనీ గ్రూప్స్ కంపెనీల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, నారాయణ ఇ-టెక్నో స్కూల్‌లో టీచర్స్, నిట్ (ఐసీఐసీఐ) బ్యాంక్‌లో రిలేషన్‌షి్‌ప మేనేజర్, డెక్కన్ కెమికల్స్ కంపెనీలో ట్రైనీ, హోండాయ్ మోబీస్, ఇసుజు మోటార్స్ కంపెనీల్లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఈ ఉద్యోగాలకు ఎస్‌ఎ్‌ససీ, ఇంట

వికాస పీడీ లచ్చారావు
కాకినాడ సిటీ, మే 26: కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని వికాస కార్యాలయంలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వికాస పీడీ కె.లచ్చారావు తెలిపారు. ఈ జాబ్‌మేళాలో బజాజ్ కేపిటల్ కంపెనీలో టెలీకాలర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, జియోఫైబర్ కంపెనీలో ఫైబర్ ఇంజనీర్, పాయింట్ అసిస్టెంట్ మేనేజర్, యూ బ్రాడ్ బాండ్ ఇండియా లిమిటెడ్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, హనీ గ్రూప్స్ కంపెనీల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, నారాయణ ఇ-టెక్నో స్కూల్‌లో టీచర్స్, నిట్ (ఐసీఐసీఐ) బ్యాంక్‌లో రిలేషన్‌షి్‌ప మేనేజర్, డెక్కన్ కెమికల్స్ కంపెనీలో ట్రైనీ, హోండాయ్ మోబీస్, ఇసుజు మోటార్స్ కంపెనీల్లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఈ ఉద్యోగాలకు ఎస్‌ఎ్‌ససీ, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన 40ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జీతం, ఇన్సెన్‌టివ్స్, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాల ఆధారంగా ఉంటుందన్నారు. ఆసక్తిగల అ భ్యర్థులు సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని వికాస కార్యాలయానికి సర్టిఫికెట్ల జెరాక్స్‌లతో హాజరుకావాలన్నారు. వివరాలకు సెల్ 7799376333లో సంప్రదించాలన్నారు.
31న క్యాంపస్ డ్రైవ్
తుని రూరల్, మే 26: శ్రీప్రకాష్ విద్యాసంస్థల అనుబంధ సంస్థ అయిన స్పేసెస్ డిగ్రీ కళాశాల నందు ఈనెల 31న క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ ఎంఎస్‌అండ్ ల్యాబ్ వారితో ఈ రిక్రూట్‌మెంట్ పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలో నిర్వహిస్తామన్నారు. 2021, 2022, 2023 విద్యాసంవత్సరంలో డిగ్రీ బీఎస్సీ పూర్తి చేసి కెమి స్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు అర్హులని తెలిపారు. సంబంధిత అభ్యర్థులు బయోడేటా సర్టిఫికెట్స్, జి రాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. ఎంపిక ప్ర క్రియలో ముందుగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉం టుందని కళాశాల ప్రిన్సిపాల్ వీర్రాజు తెలిపారు.