Share News

రూ.లక్షల్లో వార్షిక వేతనాలకు ఎంపికైన విద్యార్థులు

ABN , First Publish Date - 2023-11-10T00:22:16+05:30 IST

కాకినాడ జేఎన్టీయూకేలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌(యూసీఈకే)లో సీఎస్‌ఈ, ఈసీఈ విభాగాల్లో ఆఖరి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు.

రూ.లక్షల్లో వార్షిక వేతనాలకు ఎంపికైన విద్యార్థులు

జేఎన్టీయూకే, నవంబరు 9: కాకినాడ జేఎన్టీయూకేలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌(యూసీఈకే)లో సీఎస్‌ఈ, ఈసీఈ విభాగాల్లో ఆఖరి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. కామ్‌వాల్ట్‌, డార్విన్‌ బాక్స్‌ సంస్థల్లో కొలువులు సాఽధించిన వారికి రూ.35 లక్షలు, రూ.16.30లక్షలు వార్షిక వేతనం లభించనుందన్నారు. బహుళజాతి సంస్థలతో యూసీఈకే కళాశాల అవగాహనా ఒప్పందాలు చేసుకోవడం ద్వారా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు అమలు చేస్తున్న అంశాలు, విధివిధానాలపై ముందుగా విద్యార్థులకు శిక్షణనివ్వడం ద్వారా మంచి ప్లేస్‌మెంట్స్‌ సాఽధిస్తున్నారన్నారు. సీఎస్‌ఈ విభాగంలో ఆఖరి సంవత్సరం చదువుతున్న మన్యం శ్రీదేవి, ఈసీఈ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న బోడపాటి నివాస్‌ కామ్‌వాల్ట్‌ కంపెనీకి రూ.35లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. సీఎస్‌ఈ విభాగంలో ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మార్ని యశ్వంత్‌, అల్లాడి సంధ్యలు డార్విన్‌ బాక్స్‌ కంపెనీకి రూ.16.30 లక్షల వార్షిక వేతనానికి ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సెమినార్‌లు, శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగపరచుకునేలా చర్యలు చేపడుతున్న యూసీఈకే ప్రిన్సిపాల్‌ ఎంహెచ్‌ఎం కృష్ణప్రసాద్‌, ట్రైనింగ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారిణి డాక్టర్‌ ఆరవ కరుణలను, ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను వీసీ అభినందించారు. యూసీఈకే ప్రిన్సిపాల్‌ ఎంహెచ్‌ఎం కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ జేఎన్టీయూకే విద్యార్థులు బహుళజాతి సంస్థల్లో కొలువులు సాధించేలా అన్ని విధాలా శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ కృష్ణప్రసాద్‌ తెలిపారు. ట్రైనింగ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారిణి డాక్టర్‌ కరుణ మాట్లాడుతూ విద్యార్థులకు కోడింగ్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌పై అవగాహన, సాఫ్ట్‌స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, భావ వ్యక్తీకరణ అంశాలపై పూర్తిగా అవగాహన కలిగించేలా శిక్షణ అందిస్తున్నామన్నారు.

Updated Date - 2023-11-10T00:22:18+05:30 IST