వైసీపీ నరికింది.. జనసేన మొక్కలు నాటింది
ABN , First Publish Date - 2023-09-04T00:44:06+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో భాగంగా అమలాపురం ఎన్టీఆర్ మార్గ్ తదితర ప్రాంతాల్లో వందలాది మొక్కలను నరికేయడంతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఆది వారం పార్టీ అమలాపురం పార్లమెంటు ఇన్‌చార్జి డీఎంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
అమలాపురం టౌన్, సెప్టెంబరు 3: ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో భాగంగా అమలాపురం ఎన్టీఆర్ మార్గ్ తదితర ప్రాంతాల్లో వందలాది మొక్కలను నరికేయడంతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఆది వారం పార్టీ అమలాపురం పార్లమెంటు ఇన్‌చార్జి డీఎంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ‘వైసీపీ నరికింది.. జన సేన నాటింది’ అంటూ చేపట్టిన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల నాగసతీష్, ప్రతిపక్షనేత యేడిద శ్రీను, నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణమూర్తి, ఆర్డీఎస్ ప్రసాద్, బట్టు పండు, తిక్కా సరస్వతి, చాట్ల మంగతాయారు, డీఎస్‌ఎన్ కుమార్, కరీము ల్లాబాబా, నల్లా బ్రహ్మాజీ, పోలిశెట్టి బాబు పాల్గొన్నారు.