హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీ

ABN , First Publish Date - 2023-07-24T00:23:45+05:30 IST

సర్పవరం జంక్షన్‌, జూలై 23: హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారా? తల్లిని, చెల్లిని బయటకు పంపేసినందుకా? పార్టీ అధ్యక్షుడ్ని కలవాలంటే జైలుకి వెళ్లి కలవాల్సిన దౌర్భాగ్యస్థితిలో ఉన్నామ ని ఆనాడు సాక్షాత్తూ అసెంబ్లీలో చెప్పినందుకా ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారో చె ప్పాలంటూ కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు, రూరల్‌ ఇన్‌చార్జి పంతం నానాజీ డిమాండ్‌ చేశారు. ఆదివారం గొడారిగుంటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయ

హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీ
జనసేన పార్టీ కండువాలు వేస్తున్న నానాజీ

జనసేన పీఏసీ సభ్యుడు పంతం నానాజీ

సర్పవరం జంక్షన్‌, జూలై 23: హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారా? తల్లిని, చెల్లిని బయటకు పంపేసినందుకా? పార్టీ అధ్యక్షుడ్ని కలవాలంటే జైలుకి వెళ్లి కలవాల్సిన దౌర్భాగ్యస్థితిలో ఉన్నామ ని ఆనాడు సాక్షాత్తూ అసెంబ్లీలో చెప్పినందుకా ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారో చె ప్పాలంటూ కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు, రూరల్‌ ఇన్‌చార్జి పంతం నానాజీ డిమాండ్‌ చేశారు. ఆదివారం గొడారిగుంటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివేకా హత్యకేసులో ఎన్ని ట్విస్ట్‌లకు పాల్పడుతున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. సొంత చిన్నాన్నను హత్య చేయించిన కేసులోని నిందితులకు శిక్ష పడకుండా కాపాడుతున్న ఘన త మీ నాయకుడికే దక్కిందని ఆరోపించారు. పవన్‌ వారాహి యాత్రకు లభిస్తున్న ప్రజాదరణ చూచి ఓర్వలేని తనంతో సీఎం జగన్‌ పవన్‌పై వ్యక్తిగత విమర్శల దాడికి పాల్పడటం సిగ్గుచేటని, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి శిరంగు శ్రీనివాసరావు, పోసినరాము తదితరులున్నారు.

జనసేనలో పలువురు చేరిక

కాకినాడ ఏటిమొగ ప్రాంతానికి చెందిన టీడీ పీ, వైసీపీకి చెందిన సుమారు 70 మంది యువకులు జనసేనలో చేరారు. గొడారిగుంటలో జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్‌, సిటీ అధ్యక్షులు తోట సుఽధీర్‌ ఆధ్వర్యంలో ఏటిమొగకు చెందిన మల్లాడి రాము నాయకత్వంలో పార్టీలో చేరారు. వారిలో మల్లాడి రాంబా బు, మాల్లాడి శ్రీను, అరదాడి మహేష్‌, ఓలేటి నూకరాజు, దుర్గాప్రసాద్‌, పట్టా ధనశేఖర్‌, అం కాడి మోసె, పాలెపు మాణిక్యాలు, సంగాడి మ హేష్‌, మైలు కల్యాణ్‌, బొమ్మిడి హరికృష్ణ ఉన్నా రు. నాయకులు శాండీ, విజయ్‌గోపాల్‌ మున్నా, శిరంగు శ్రీనివాస్‌, తూము బన్ను పాల్గొన్నారు.

Updated Date - 2023-07-24T00:23:45+05:30 IST