వారాహి యాత్రపై ప్రచారం నిర్వహించాలి
ABN , First Publish Date - 2023-06-07T00:32:25+05:30 IST
సర్పవరం జంక్షన్, జూన్ 6: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు ప వన్ జిల్లా పర్యటనలో భాగంగా ఈనెల 17,18న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వారాహి యాత్రకు విచ్చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజల కు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆ పార్టీ రూరల్ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు పంతం నానా జీ కో
జనసేన పీఏసీ సభ్యుడు పంతం నానాజీ
సర్పవరం జంక్షన్, జూన్ 6: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు ప వన్ జిల్లా పర్యటనలో భాగంగా ఈనెల 17,18న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వారాహి యాత్రకు విచ్చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజల కు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆ పార్టీ రూరల్ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు పంతం నానా జీ కోరారు. వారాహి యాత్ర విజయవంతం కోసం మంగళవారం కాకినాడలో పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 17న స్థానికంగా పర్యటించి సమస్యలపై మహిళలు, యువకులు, మత్స్యకారులు, రైతులు, కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారన్నారు. 18న వారాహి ద్వారా బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. పవన్ పర్యటనపై పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి, కరపత్రాలు అందించాలని, ఫ్లెక్సీలు, ఆటోల్లో ప్ర చారం నిర్వహించాలని కోరారు. యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో మండలాధ్యక్షుడు కరెడ్ల గోవిందు, మాదారపు తాతాజీ, రాజేశ్వరి, కడలి ఈశ్వరి, గవర శ్రీరాములు, శిరంగు శ్రీనివాసరావు, రెడ్డిపల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.