అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సునామీ ఖాయం

ABN , First Publish Date - 2023-03-18T00:02:40+05:30 IST

జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ విజయవంతం కావడం పట్ల అధికార పార్టీలో భయాందోళనలు ప్రారంభమయ్యాయని, పవన్‌ కల్యాణ్‌ ప్రభంజనంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సునామీ సృష్టించడం ఖాయమని ఆపార్టీ పీఏసీ సభ్యుడు, కాకినాడ రూరల్‌ ఇన్‌చార్జి పంతం నానాజీ తెలిపారు. శుక్రవారం గొడారిగుంట నానాజీ గృహం లో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఆవిర్భావ సభకు లక్షలాది మంది వచ్చి విజయవంతం చేశారన్నారు. పవన్‌ కార్యక్రమం చేసిన ప్రతీసారీ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు, నిరా

అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సునామీ ఖాయం
సమావేశంలో మాట్లాడుతున్న నానాజీ

పీఏసీ సభ్యుడు పంతం నానాజీ

సర్పవరం జంక్షన్‌, మార్చి 17: జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ విజయవంతం కావడం పట్ల అధికార పార్టీలో భయాందోళనలు ప్రారంభమయ్యాయని, పవన్‌ కల్యాణ్‌ ప్రభంజనంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సునామీ సృష్టించడం ఖాయమని ఆపార్టీ పీఏసీ సభ్యుడు, కాకినాడ రూరల్‌ ఇన్‌చార్జి పంతం నానాజీ తెలిపారు. శుక్రవారం గొడారిగుంట నానాజీ గృహం లో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఆవిర్భావ సభకు లక్షలాది మంది వచ్చి విజయవంతం చేశారన్నారు. పవన్‌ కార్యక్రమం చేసిన ప్రతీసారీ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు, నిరాధారణ ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని, టీడీఆర్‌ బాండ్ల స్కామ్‌లో మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై అనేక ఆరోపణలువచ్చాయని, వీటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే కన్నబాబుకు సిద్ధాంతాలు లేవని, సీఎంని జైలుకి, బెయిల్‌కి మఽధ్య ఊగిసలాడే పార్టీ అని అసెంబ్లీ సాక్షిగా విమర్శించి, ఇప్పుడు ఆపార్టీలోనే ఉంటూ సీఎం ప్రాపకం కోసం పవన్‌పై అనుచిత వ్యాఖ్య లు చేస్తున్నారని విమర్శించారు. కాకినాడ సిటీలో ఎన్నడూలేని రీతిలో దాడులు, దౌర్జనాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పీఏసీ సభ్యుడు ముత్తా శశిధర్‌ విమర్శించారు. పొట్టి శ్రీరాములు జయంతి నుంచి అంబేడ్కర్‌ జయం తి వరకు జనసేన ఆధ్వర్యంలో సామాజిక న్యా యం జనసేనతోసాధ్యం పేరుతో సామాజిక చైత న్య యాత్ర నిర్వహిస్తున్నామని పోస్టర్‌ని ఆవిష్కరించారు. సమావేశంలో మండలాధ్యక్షుడు కరెడ్ల గోవిందు, తాటికాయల వీరబాబు, ఎస్‌ ముసలయ్య, భోగిరెడ్డి కొండలరావు తదితరులున్నారు.

Updated Date - 2023-03-18T00:02:40+05:30 IST