Share News

చెరువుకు గండిపై జనసేన ఆందోళన

ABN , First Publish Date - 2023-12-11T00:31:10+05:30 IST

వైసీపీ నాయకుల అక్రమాలకు అంతే లేకుం డాపోయింది. మట్టి తవ్వకానికి ఏకంగా ఒక చెరువు గట్టునే కొట్టేశారు. దీంతో జగనన్న కాలనీతో పాటు రైతుల పంటలు నాశనమయ్యాయి.

చెరువుకు గండిపై జనసేన ఆందోళన
ఆందోళన చేస్తున్న బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, డిసెంబరు 10 : వైసీపీ నాయకుల అక్రమాలకు అంతే లేకుం డాపోయింది. మట్టి తవ్వకానికి ఏకంగా ఒక చెరువు గట్టునే కొట్టేశారు. దీంతో జగనన్న కాలనీతో పాటు రైతుల పంటలు నాశనమయ్యాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు జేసీబీతో కావాలనే చెరువుకు గండికొట్టారని.. దీంతో పంట పొలాల్లో ధాన్యంతో పాటు పాడి పశువులు, పశుగ్రాసం నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు వాపో తున్నారు తోకాడ ఊరచెరువుకు గండి కొట్టిన ఘటనలో రూ.కోటి చేతులు మారినట్టు రైతులు చెబుతున్నారు. ఈ వ్యవహారమంతా గతేడాది కాలంగా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే గుట్టు చప్పుడు కాకుండా సాగుతు న్నట్టు సమాచారం. గ్రామంలో ముందుగా ఎవరికీ చెప్పకుండా పథకం ప్రకారం శని, ఆదివారాలు వరుస సెలవులు కావడం, అధికారులెవరూ అం దుబాటులో లేకపోవడాన్ని అదునుగా భావించిన చెరువుకు గండికొట్టారు. దీని వల్ల వల్ల రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని రైతులు , బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు సమాచారం అందుకున్న జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంప తులు బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ స్ధానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మట్టి కోసం చెరువుకు గండి కొట్టడం ఏమిటని మండిపడ్డారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. చెరువుకు గండి కొట్టడంతో తోకాడ-రాధేయపాలెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్లంపూడిలో జగనన్న కాలనీలో ఇళ్లు నీట మునిగి కాలనీవాసులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారన్నారు.జనసేన నాయకులు కిమిడి శ్రీరామ్‌, గళ్లా రంగా, దొరబాబు, తమ్మారావు తదితరులు ఆందోళన చేసిన వారిలో ఉన్నారు.

====================

Updated Date - 2023-12-11T00:31:14+05:30 IST