రహదారులను గాలికొదిలేసిన ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-11-21T23:31:45+05:30 IST
గండేపల్లి, నవంబరు 21: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రహదారులను పూర్తిస్థాయిలో గాలికి వదిలేసిందని, రాబోయే రోజు ల్లో ఓటు అనే ఆయుధం ద్వారా అసమర్ధ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జనసేన ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లాల సంయుక్త కార్యదర్శి బాబు పేర్కొన్నారు. గండేపల్లిలో మంగళవారం టీడీపీ, జనసేన సారథ్యంలో చేపట్టిన గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమానికి వా

టీడీపీ, జనసేన నేతలు నెహ్రూ, బాబు
గండేపల్లి, నవంబరు 21: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రహదారులను పూర్తిస్థాయిలో గాలికి వదిలేసిందని, రాబోయే రోజు ల్లో ఓటు అనే ఆయుధం ద్వారా అసమర్ధ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జనసేన ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లాల సంయుక్త కార్యదర్శి బాబు పేర్కొన్నారు. గండేపల్లిలో మంగళవారం టీడీపీ, జనసేన సారథ్యంలో చేపట్టిన గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యల్లమిల్లి రోడ్డు నుంచి సుమారు 5కిలోమీటర్ల మేర నా యకులు, కార్యకర్తలతో వైసీపీ ప్రభుత్వం ఇప్పటి కైనా గుంతలను పూడ్చి అభివృద్ధి చేయాలని ని నాదాలు చేస్తూ మేరకు పాదయాత్ర చేస్తూ రో డ్లు పరిశీలించారు. యల్లమిల్లి నుంచి రంగంపేట మండలం, రంగంపేట మండలం నుంచి యల్లమిల్లి గండేపల్లి, రామయంపాలెం, సింగరాయపాలెం మీదుగా కోరుకొండ మండలం, గోకవరం మండలం వెళ్లే ప్రధాన రింగు రోడ్డు రహదారి పూర్తిగా గోతులమయంగా మారి కొద్దిపాటి చినుకులకే చెరువులు తలపిస్తున్నాయన్నారు. ఆ రోడ్లు వెంట ప్రయాణం చేయాలంటే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అది కనిపించ డం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ ని ప్రజలు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉ న్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండలాధ్యక్షుడు పోతుల మోహన్‌రావు, జిల్లా ఉపాధ్యక్షుడు కో ర్పు సాయితేజ్, గండేపల్లి గ్రామ అధ్యక్షుడు య లమాటి కాశి, బొల్లంరెడ్డి రామకృష్ణ, అడబాల భాస్కరరావు, పైలా వెంకన్న, ఇప్పిర్ల బాబి, మ ద్దిపాటి వీర వెంకట సత్యనారాయణ, మాదిరెడ్డి కృష్ణార్జున, ఆళ్ళ సత్తిబాబు, సుంకవిల్లి రాజు, వెంకన్న దొర, దిడ్డి శ్రీను, బొండా శ్రీనుబాబు, కొల్లు త్రిమూర్తులు, టి.ప్రకాష్, కంటిపూడి సత్యనారాయణ, శీలామంతుల వీరబాబు, యర్రంశెట్టి బాబ్జి, చాగంటి సత్యనారాయణ, రెడ్డి సు బ్బారావు, జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.