Share News

సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి

ABN , First Publish Date - 2023-11-10T23:35:16+05:30 IST

జగ్గంపేట, నవంబరు 10: వైసీపీ 52 నెలల పరిపాలనలో ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాధలతో రాష్ట్రంలో ఒక్కొ క్క కుటుంబంపై రూ.8,25,549 భారం మోపారని, దీనికి ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ డిమాండ్‌ చేశారు. స్థానిక రావులమ్మనగర్‌లోని

సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట, నవంబరు 10: వైసీపీ 52 నెలల పరిపాలనలో ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాధలతో రాష్ట్రంలో ఒక్కొ క్క కుటుంబంపై రూ.8,25,549 భారం మోపారని, దీనికి ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ డిమాండ్‌ చేశారు. స్థానిక రావులమ్మనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకర్లతో నెహ్రూ మాట్లాడూతూ విద్యుత్‌ చార్జీల ద్వారా ప్రజలపై రూ.57వేల కోట్లు భారం మోపారని, తన బినామీలు ద్వారా స్మార్ట్‌మీటర్లు, విద్యుత్‌ పరికరాలు కొనుగోలు రూ.15వేల కోట్లు కమిషన్‌ జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌కు చేరలేదా అని ప్రశ్నించారు. నాసిరకం మద్యం వల్ల 35లక్షలు మం దిని రోగాల బారిన పడేశారని, అందులో 30వేల మంది ప్రా ణాలు పోయాయని, మద్యం కమిషన్‌లోనే లక్ష కోట్లు తాడేపల్లి ప్యాలస్‌కు చేరలేదా అని ప్రశ్నించారు. ఉచిత ఇసుక విధానం రద్దు చేసి 4 రెట్లు ఇసుక రేట్లు పెంచిన భవన నిర్మాణ రంగాన్ని కప్పకూల్చి 125 వృత్తుల వరిని భవన నిర్మాణపరంగా వ్యాపారులను దెబ్బతీశాడని, 30లక్షల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయేలా చేశారని దీనిపై జగన్‌పై సమాధానం చెప్పాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గరనుంచి మంత్రులు, ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుని సర్వనాశనం చేశారని, 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌వీఎస్‌ అప్పలరాజు, కొత్త కొండబాబు, దాపర్తి సీతారామయ్య, వేములకొండ జో గారావు, సాంబత్తుల చంద్రశేఖర్‌, బద్ది సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T23:35:17+05:30 IST