‘టీడీపీ విజయానికి బూత్‌ కమిటీలు పని చేయాలి’

ABN , First Publish Date - 2023-06-26T00:25:51+05:30 IST

జగ్గంపేట, జూన్‌ 25: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి బూత్‌ కమిటీలు సమర్థవంతంగా పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నా రు. స్థానిక పార్టీ కార్యాలయంలో జగ్గంపేట టౌన్‌ శ్రీరామ్‌గన్‌ బూత్‌ కమిటీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులతో ఆదివారం నెహ్రూ సమావేశం నిర్వహించారు. ఈ సం

‘టీడీపీ విజయానికి బూత్‌ కమిటీలు పని చేయాలి’

జగ్గంపేట, జూన్‌ 25: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి బూత్‌ కమిటీలు సమర్థవంతంగా పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నా రు. స్థానిక పార్టీ కార్యాలయంలో జగ్గంపేట టౌన్‌ శ్రీరామ్‌గన్‌ బూత్‌ కమిటీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులతో ఆదివారం నెహ్రూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా ప్రతి వందమందికి ఒక స్త్రీ,ఒక పురుషుడు కుటుంబ సాధికార సారధులుగా నియమించుకోవాలని, టీడీపీ మహానాడులో ప్రకటించిన మేనిఫోస్టో కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చేయబోయే పనులన్నీ ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో ఎస్‌వీఎ్‌స.అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, బూత్‌ కమిటీ ఇన్‌చార్జ్‌ మాజీ ఎంపీటీసీ పిలా వెంకటలక్ష్మి మహేష్‌, బూత్‌ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:25:51+05:30 IST