‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభం

ABN , First Publish Date - 2023-05-10T00:29:52+05:30 IST

జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారంపై మరింత బాధ్యత పెరిగిందని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు.

‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభం
సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, ఇతర అధికారులు

బొమ్మూరు, మే 9: జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారంపై మరింత బాధ్యత పెరిగిందని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. బొమ్మూరు కలెక్టరేట్‌లో మంగళవారం జగనన్నకు చెబుదాం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, ఎస్పీ సీహెచ్‌.సుధీర్‌ కుమార్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తాడేపల్లి నుంచి సీఎం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాధవీలత మాట్లాడుతూ ప్రతి సోమవారం స్పందన ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.ఇప్పుడు జేకేసీ కార్యక్రమానికి సీఎం పేరు ఉండటం వల్ల మనపై జవాబుదారితనం పెరిగిందన్నారు. అర్హత ఉన్న సమస్యను మన సమస్యగా పరిగణించాలని సీఎం స్పష్టం చేశారన్నారు. జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాల్లో మానిటరింగ్‌ యూనిట్స్‌ ఏరాటు చేశామన్నారు.జేసీ తేజ్‌భరత్‌, రూడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, డీఆర్వో నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-10T00:29:52+05:30 IST