జగనన్న సురక్ష శిబిరాల్లో 5,77,753 మందికి సేవలు
ABN , First Publish Date - 2023-08-02T00:58:55+05:30 IST
జిల్లాలో గత 31 రోజులుగా నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంప్‌ల ద్వారా 5, 77,753 మందికి సేవలు అందించడం జరిగిందని కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత తెలిపారు.
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 1: జిల్లాలో గత 31 రోజులుగా నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంప్‌ల ద్వారా 5, 77,753 మందికి సేవలు అందించడం జరిగిందని కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. సచివాలయ వ్యవస్ధ ద్వారా 540 సేవలు ప్రజలకు అందించడం జరిగిందన్నారు. నవరత్నాలు కింద 99 శాతం మంది అర్హులకు పఽథకాలు చేరవేయడం జరిగిందన్నారు. సచివాయల గ్రామ సభల ద్వారా 5,94,139 టోకెన్లు జారీ చేయగా వాటిలో 5,79,067 సర్వీసులను గుర్తించి 5,77,753 సేవలను లబ్ధిదారులకు అందించామని చెప్పారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, ఆర్‌డీవో చైత్రవర్షిణి పాల్గొన్నారు.