ప్రతి కుటుంబాన్ని ఆహ్వానించండి

ABN , First Publish Date - 2023-05-26T00:59:30+05:30 IST

ఈ నెల 27, 28 తేదీల్లో వేమగిరిలో జరిగే మహానాడుకు గ్రామాల్లో ప్రతి కుటుంబానికి వెళ్లి పసుపుబొట్టు పెట్టి ఆహ్వానించాలన్నారు. జగన్‌పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారని, ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారని టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు గొర్రెల శ్రీధర్‌ అ న్నారు.

ప్రతి కుటుంబాన్ని ఆహ్వానించండి
రాజమహేంద్రవరంలో ఇంటింటికీ వెళ్లి పిలుపులు నిర్వహిస్తున్న తెలుగు మహిళలు

  • మహానాడుకు వేల సంఖ్యలో తరలిరావాలి

  • టీడీపీ కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడు శ్రీధర్‌

  • పలుచోట్ల తెలుగుదేశం నాయకుల సమావేశాలు

కొవ్వూరు, మే 25: ఈ నెల 27, 28 తేదీల్లో వేమగిరిలో జరిగే మహానాడుకు గ్రామాల్లో ప్రతి కుటుంబానికి వెళ్లి పసుపుబొట్టు పెట్టి ఆహ్వానించాలన్నారు. జగన్‌పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారని, ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారని టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు గొర్రెల శ్రీధర్‌ అ న్నారు. గురువారం కొవ్వూరు లిటరరీ క్లబ్‌ కల్యాణ మండపంలో నియోజకవర్గ నాయకులతో మహానాడుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహానాడుకు ప్రత్యేకత ఉందని, పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ వందో పుట్టినరోజన్నారు. కొవ్వూరులోని రెండు వంతెనలు పసుపుమయం కావాలన్నారు. నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో తరలిరావాలన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్నారు. మహానాడు తెలుగుతమ్ముళ్ల పండుగ అని ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణారావు అన్నారు. సమావేశంలో పట్టణ, మండల దాయన రామకృష్ణ, వట్టికూటి వెంకటేశ్వరరావు, తాళ్లపూడి మండలాధ్యక్షుడు నామాన పరమేష్‌, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, పొట్రు శ్రీనివాసరావు, బూరుగుపల్లి రాఘవులు, గారపాటి శ్రీదేవి, కొఠారు వెంకట్రావు, కెగాల శ్రీనివాస్‌, బేతిన నారాయణ పాల్గొన్నారు.

  • రండమ్మా! మహానాడుకు

రాజమహేంద్రవరం సిటీ, మే 25: ఈనెల 27, 28 తేదీల్లో వేమగిరిలో జరిగే తెలుగుదేశం మహానాడు వేడుకలకు తెలుగు మహిళలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు పిలుపుమేరకు గురువారం రాజమహేంద్రవరంలో పార్లమెంట్‌ కమిటీ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర అధ్యక్షురాలు కొసూరి చండీప్రియల ఆధ్వర్యంలో మహిళలు ఆత్మీయ ఆహ్వానాలు పలికారు. నగరంలో ఇంటింటికీ వెళ్లి ఆడపడచులకు బొట్టుపెట్టి మహానాడు పండుగను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అంగన్‌వాడీ కమిటీ అధికార ప్రతినిఽధి కప్పల వెలుగుకుమారి, ద్వారా పార్వతీసుందరి, కాకర్ల సుజనాచౌదరి, మీసాల నాగమణి, నిడదవోలు మహిళా కమిటి అధ్యక్షురాలు నండూరి పుష్పవతి, దొంగ నాగమణి, కానేటి కృపామణి, తుల్లి పద్మ, కర్ణం లక్ష్మీనాయుడు, బోణం ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:59:30+05:30 IST