ఇంటర్‌ ఆంగ్ల పరీక్షకు 17,550 మంది హాజరు

ABN , First Publish Date - 2023-03-19T00:24:52+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఆంగ్లపేపర్‌ 2 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు డీవీఈవో నూకరాజు తెలిపారు. ఉద యం 9 నుంచి 12 గంటలవరకూ నిర్వహించిన ఈ పరీక్షకు జనరల్‌ విభాగంలో 16,732 మందికి 16,246

ఇంటర్‌ ఆంగ్ల పరీక్షకు 17,550 మంది హాజరు

డీవీఈవో నూకరాజు

కాకినాడ రూరల్‌, మార్చి 18: జిల్లా వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఆంగ్లపేపర్‌ 2 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు డీవీఈవో నూకరాజు తెలిపారు. ఉద యం 9 నుంచి 12 గంటలవరకూ నిర్వహించిన ఈ పరీక్షకు జనరల్‌ విభాగంలో 16,732 మందికి 16,246 మంది హాజరుకాగా ఒకేషనల్‌కి 1354మందికి 1304మంది విద్యార్ధులు హాజరయ్యారన్నారు. మొత్తం రెండు విభాగాలకు 17,550 మంది పరీక్ష రాశారన్నారు.

Updated Date - 2023-03-19T00:24:52+05:30 IST