Share News

ఈ నెల 30లోపు ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించాలి

ABN , First Publish Date - 2023-11-21T00:16:52+05:30 IST

వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ రెగ్యులర్‌, ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఈ నెల (నవంబరు) 30 లోపుగా పరీక్ష ఫీజును చెల్లించాలని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్‌ఎస్‌వీఎల్‌ నరసింహం పేర్కొన్నారు.

ఈ నెల 30లోపు ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించాలి

రాజమహేంద్రవరం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ రెగ్యులర్‌, ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఈ నెల (నవంబరు) 30 లోపుగా పరీక్ష ఫీజును చెల్లించాలని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్‌ఎస్‌వీఎల్‌ నరసింహం పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ శ్రద్ధ వహించాలన్నారు. ఇప్పటి వరకూ ఫీజు చెల్లించిన విద్యార్థులు, మిగతా విద్యార్థులు చెల్లించకపోవడానికి కారణాలతో నివేదికను తమ కార్యాలయానికి ఈ-మెయిల్‌ ద్వారా పంపించాలని ఆదేశించారు. ఫెయిలైన విద్యార్థులందరితో పరీక్ష ఫీజు కట్టించేలా చొరవ తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి అలసత్వమూ వహించరాదని చెప్పారు. అలాగే ఇంటర్‌ ద్వితీయ ఏడాది చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, డిగ్రీ విద్యపై హెచ్‌సీఎల్‌ టెక్‌బీ సంస్థ ప్రతినిధులు కళాశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఎక్కువ మంది పేర్లు రిజిస్టర్‌ చేయించి డిసెంబరులో నిర్వహించే పరీక్షకు సన్నద్ధం చేయాలని ప్రిన్సిపాల్స్‌కి, విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. మరిన్ని వివరాలకు 9642973350(సాయికిరణ్‌) నెంబరుకు ఫోన్‌ చేయాలని కోరారు.

Updated Date - 2023-11-21T00:16:54+05:30 IST