పరిశ్రమలకు విద్యుత్ కోత
ABN , First Publish Date - 2023-09-04T00:41:40+05:30 IST
పరిశ్ర మలకు కష్టకాలం వచ్చింది. విద్యుత్ సరఫరాలో కోతలు విధిం చారు. ఈనెల 5నుంచి 15వతేదీ వరకూ కొన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
వారానికో రోజు పవర్ హాలిడే
గృహ, వ్యవసాయానికి విద్యుత్ అంతరాయం రానీయం
ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్ మూర్తి
రాజమహేంద్రవరం, సెప్టెంబరు3 (ఆంధ్రజ్యోతి): పరిశ్ర మలకు కష్టకాలం వచ్చింది. విద్యుత్ సరఫరాలో కోతలు విధిం చారు. ఈనెల 5నుంచి 15వతేదీ వరకూ కొన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పరిశ్రమలకు విని యోగ గడవు నిర్ణయించడంతోపాటు వారానికో రోజు పవర్ హాలిడే ప్రకటించాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగ దారులకు విద్యుత్ అంతరాయం మోనటరింగ్ చేస్తున్నామని, వినియోగదారులంతా సహకరించాలని ఏపీఈపీడీసీఎల్ రాజ మహేంద్రవరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. ఈమేరకు ఆదివారం వివరాలు తెలిపారు. పరిశ్ర మల విద్యుత్ వినియోగం మీద పరిమితులు విధించి, గృహ వినియోగదారులకు పూర్తిగానూ, వ్యవసాయ వినియోగదారు లకు 9గంటలు నిరంతరం 3ఫేజ్ సఫ్లయ్ చేయడానికి ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకూ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల మేరకు నియంత్రి స్తామన్నారు. పరిశ్రమలు కాంట్రాక్టర్ మాగ్జిమం డిమాండ్ (సీఎండీ)లో 70శాతం వాడాలనాని, నాన్ కంటిన్యూస్ ప్రాసెస్ పరిశ్రమలు పగలు 6గంటల నుంచి సాయంత్రం 6గంటలలోపు కేవలం ఒక షిఫ్ట్‌ను మాత్రమే కొనసాగించాల న్నారు. పవర్ హాలిడే వారంలో ఒకరోజు నిర్ణీత ప్రాంతాలలో వాడాల్సి ఉంటుందన్నారు. జగ్గంపేట డివిజన్‌లో సోమవారం, కాకినాడ డివిజన్‌లో మంగళవారం, పెద్దాపురం డివిజన్‌లో బుధవారం, రాజమహేంద్రవరం రూరల్ డివిజన్‌లో గురు వారం, అమలాపురం డివిజన్‌లో శుక్రవారం, రాజమ హేంద్ర వరం అర్బన్, రామచంద్రాపురం డివిజన్లలో శనివారం పవర్ హాలిడే ఉంటు ందన్నారు. ప్రతీ 220/132 కెవి సబ్-స్టేషన్లలో విద్యుత్ పర్యవేక్షించడానికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. విద్యుత్ సరఫరా సమాచారం కోసం 1912 ట్రోల్ ప్రీ నంబ రును సంప్రదించాలన్నారు.
రాజమహేంద్రవరం సర్కిల్ ఆఫీసులో 7382299960, రాజమహేంద్రవరం అర్బన్ డివిజన్‌లో 9440812585, రూ రల్ డివిజన్‌లో 7382585487, కాకినాడ డివిజన్‌లో 94408 12586, పెద్దాపురం డివిజన్‌లో 8333818099, జగ్గంపేట డివిజన్‌లో 944081 2589, అమలాపురం డివిజన్‌లో 9440812588, రామచంద్రపురం డివిజన్‌లో 94408 12587, రంపచోడవరం డివిజన్‌లో 7382585554కు సంప్రదించాల న్నారు. అత్యవరసర పరిస్థితులలో బ్రేక్‌డౌన్స్, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ చేయడానికి 24గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.