రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం
ABN , First Publish Date - 2023-09-26T01:17:21+05:30 IST
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం రాజ్యమేలుతోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామచంద్రపురం, సెప్టెబరు 25: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం రాజ్యమేలుతోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు, అణచివేత, అరాచకాలు, ఎస్సీ, బీసీ వర్గాలను అణగదొక్కడం, నిరంకుశ పాలన, అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం 13వ రోజు రిలే నిరాహారదీక్షను ఆయన ప్రారంభించారు. బాబుతో నేనులో భాగంగా సంతకాలు, అభిప్రాయాలు సేకరించారు. ఈదీక్షలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జ్‌లు, నాయకులు పాల్గొన్నారు.