సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-09-26T01:16:31+05:30 IST

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ సీజనల్‌ వైరల్‌ వ్యాధులు ప్రబల కుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సూచించారు.

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

అమలాపురం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ సీజనల్‌ వైరల్‌ వ్యాధులు ప్రబల కుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు రక్షిత మంచినీరు సరఫరా చేయాలని, తాగునీటి సరఫరాలో వృథాను అరికట్టి సంరక్షణ చర్యలను బలోపేతం చేయాలన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త పారబోయడంతో రోగాలు వస్తున్న విషయాన్ని వివరి స్తూ ముమ్మిడివరం ఎంపీడీవో జె.రాంబాబు ఆలపించిన రెం డు పాటలను కలెక్టర్‌ విడుదల చేశారు. డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, డీపీవో వి.కృష్ణ కుమారి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ సీహెచ్‌ఎన్వీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. తొలుత స్పందన పాత హాలులో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్‌ వ్యాధులు, వైరల్‌ జ్వరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.

Updated Date - 2023-09-26T01:16:31+05:30 IST