వివాహేతర బంధమే ప్రాణం తీసింది

ABN , First Publish Date - 2023-06-11T01:11:33+05:30 IST

గత ఆదివారంరాత్రి కోరుకొండలో జరిగిన యువకు డి హత్య కేసును కోరుకొండ పోలీసులు ఐదు రోజుల్లో ఛేదించారు. ఈ హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమేనని తెలిపారు.

వివాహేతర బంధమే ప్రాణం తీసింది

కోరుకొండ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఎనిమిది మంది అరెస్ట్‌.. నిందితుల్లో ఇద్దరు మహిళలు

కారు, ఏడు సెల్‌ఫోన్లు, చాకు, రెండు బైక్‌లు స్వాధీనం

కోరుకొండ, జూన్‌ 10: గత ఆదివారంరాత్రి కోరుకొండలో జరిగిన యువకు డి హత్య కేసును కోరుకొండ పోలీసులు ఐదు రోజుల్లో ఛేదించారు. ఈ హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమేనని తెలిపారు. ఇం దుకు సంబంధించి శనివారం ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ఇద్దరు మ హిళలు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం సాయ ంత్రం కోరుకొండ సీఐ జి.ఉమామహేశ్వరరావు, ఎస్‌ఐ శారదాసతీష్‌ మీడి యాకు తెలియజేశారు. కోరుకొండకు చెందిన నాగలక్ష్మి ఎస్‌బీఐలో తాత్కాలిక మెసేంజర్‌గా పనిచేస్తోంది. ఆమె కోరుకొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యా ణ మండపం వెనుక ఫిట్‌నెస్‌ సెంటర్‌ని ఎ.పద్మావతితో కలిసి నడిపిస్తోంది. వీరిలో ఒకరు నిర్వాహకురాలు కాగా, మరొకరు కోచ్‌గా పని చేస్తున్నారు. నాగార్జునరెడ్డి కర్నూలుజిల్లా నుంచి వచ్చి రాజానగరం వైఎస్సా ర్‌ కాలనీలో మకాం ఉంటూ ఫైనాన్స్‌ కంపెనీలు ఇచ్చిన బైక్‌లకు సం బంధించి రికవరీ లు చేయడం, వాయిదాలు కట్టని బైక్‌లను సీజ్‌ చేయడం కోసం పనిచే స్తాడు. అనంతరంపురం జిల్లా నుంచి వచ్చిన గుత్తి, రాజేంద్రప్రసాద్‌ రాజా నగరం వైఎస్సార్‌ కాలనీలో రూం తీసుకుని ఉంటూ బైక్‌ల సీజ్‌ చేయడంలో నాగార్జునరెడ్డికి సహాయంగా ఉంటారు. కోరుకొండలో సప్లై కంపెనీ నిర్వాహ కుడు ముబ్బిడిశెట్టి శ్రీనివాస్‌(34)తో నాగలక్ష్మికి రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. కర్నూలు జిల్లాకు చెందిన రాజానగరంలో నివాసం ఉంటున్న నాగార్జునరెడ్డితో కూడా ఆమె వివాహేతర బంధం కొన సాగి స్తోంది. ఈ విషయాన్ని శ్రీనివాస్‌.. తన భర్తకు చెబుతాడేమోనని నాగలక్ష్మి భయపడి పద్మావతికి చెప్పింది. ఇద్దరూ కలిసి నాగార్జునరెడ్డికి చెప్పారు. ఈ ముగ్గురు ఆలోచించుకుని శ్రీనివాస్‌ను హత్య చేసేందుకు ప్రణాళిక రచించా రు. ఇందు కోసం నాగార్జునరెడ్డి తన స్నేహితులైన అనంతపురం జిల్లాకు చెందిన గుత్తి, రాజేంద్రప్రసాద్‌, రాజానగరానికి చెందిన దిలీప్‌, వెంకటేష్‌, అహ్మద్‌ల సహాయం తీసుకున్నాడు. శ్రీనివాస్‌ను హత్య చేసేందుకు నాగా ర్జునరెడ్డి మూడు నెలలుగా రాజేంద్రప్రసాద్‌తో కలిసి రెక్కీ నిర్వహిస్తున్నారు. ఈనెల 4వ తేదీ రాత్రి కోరుకొండలోని సీతారామ్‌న గర్‌లో ఉన్న సప్లై కంపెనీ గోడౌన్‌ వద్దకు వచ్చిన శ్రీనును చీకట్లో బయటకు పిలిచి వెంకటేష్‌ అతని కళ్లల్లో కారం కొట్టాడు. దిలీప్‌, అహ్మద్‌లు శ్రీనును పట్టుకుని కత్తితో పొడిచి పరారయ్యారు. నిందితుల్లో ఐదుగురిని రాజానగరం వైఎస్సార్‌ కాల నీ వద్ద, ఒక వ్యక్తిని కోరుకొండ మండలం గుమ్ముళ్ళూరు వద్ద, ఇద్దరు మహిళలను కోరుకొండ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ మండ పం సమీ పంలో గల ఫిట్‌నెస్‌ సెంటర్‌ వద్ద అరెస్ట్‌ చేశామని తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన చాకు, ఒక ఇనుప రాడ్‌, ఏడు సెల్‌ఫోన్‌లు, ఒక కారు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు. కాగా రాజేంద్రప్రసాద్‌ నకిలీ ఆర్టీవోగా ఉంటూ బైక్‌లు అప్‌ చేస్తున్న సందర్భంలో బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉంది. రాజానగరానికి చెందిన వెంకటేష్‌ కూడా పోలీస్‌ కానిస్టేబుల్‌పై జరిగిన దాడిలో పాత నేరస్తుడని సీఐ తెలిపారు. కేసును ఛేదించడంలో కృషిచేసిన సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్‌ఐ శారదాసతీష్‌, మరో 10మంది పోలీస్‌, సాంకేతిక సిబ్బందిని ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి అభి నందించారు.

Updated Date - 2023-06-11T01:11:33+05:30 IST