నాడు విద్యార్థిని.. నేడు హెచ్‌ఎం

ABN , First Publish Date - 2023-06-11T01:06:08+05:30 IST

ఒకనాడు ఆ పాఠశాలలో విద్యార్థిని.. నేడు అదే పాఠ శాలకు హెచ్‌ఎం.. అనపర్తి లోని ద్వారంపూడి బుల్లె మ్మాయి జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠ శాలలో అనపర్తికి చెందిన కర్రి కళ్యాణి 1986 - 91 విద్యా సంవత్సరాల మధ్య ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించారు.

నాడు  విద్యార్థిని.. నేడు హెచ్‌ఎం
హెచ్‌ఎం కళ్యాణి

అనపర్తి, జూన్‌ 10: ఒకనాడు ఆ పాఠశాలలో విద్యార్థిని.. నేడు అదే పాఠ శాలకు హెచ్‌ఎం.. అనపర్తి లోని ద్వారంపూడి బుల్లె మ్మాయి జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠ శాలలో అనపర్తికి చెందిన కర్రి కళ్యాణి 1986 - 91 విద్యా సంవత్సరాల మధ్య ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించారు. చిన్న నాటి నుంచి చదువుపై ఉన్న మక్కువ.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంచెలం చెలుగా ఎదిగి 2000వ సంవత్సరంలో ప్రభుత్వ పాఠ శాల ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. ఇన్నీసుపేట, కోరుకొండ, ఆలమూరు, ఏడిద ఉన్నత పాఠశాలల్లో పనిచేశారు. ఇప్పటి వరకు మండలంలోని పులగుర్త ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తూ బదిలీపై అనపర్తిలో ఆమె చదువుకున్న పాఠశాలకే వచ్చారు. హెచ్‌ఎంగా శనివారం భాద్యతలు స్వీకరించి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఉపాధ్యాయు రాలిగానే కాకుండా హోమియో వైద్యంలో కూడా శిక్షణ పొందిఆమె వైద్య రంగంలో ఉచిత సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలకే హెచ్‌ఎం రావడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాలను ప్రథమస్థానంలో నిలబెడతానన్నారు.

Updated Date - 2023-06-11T01:06:08+05:30 IST